ఇదెక్కడి క్రైం? షాకింగ్ మారిన పుప్పాలగూడ డబుల్ మర్డర్
అనంత పద్మనాభస్వామి ఆలయ గుట్టల వద్ద ఒక యువతి.. ఒక యువకుడు దారుణ హత్యకు గురయ్యారు. వీరిని భారీ బండరాయితో మోది హత్యకు చేసినట్లుగా తెలుస్తోంది.
By: Tupaki Desk | 15 Jan 2025 11:52 AM GMTహైదరాబాద్ మహానగరంలో నిత్యం ఏదో ఒక మూల హత్య జరుగుతూనే ఉంటుంది. అయితే.. అన్ని హత్యలు ఒకలా ఉండవన్నట్లుగా.. తాజాగా వెలుగు చుసిన డబుల్ మర్డర్ గురించి తెలిస్తే మాత్రం నోట మాట రాదంతే. హైదరాబాద్ శివారు.. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిధిలోని నార్సింగ్ పోలీసు స్టేషన్ పరిధిలోని నార్సింగ్ లో ఒక షాకింగ్ డబుల్ మర్డర్ జరిగింది. పండుగ పూట జరిగినట్లుగా భావిస్తున్న ఈ డబుల్ మర్డర్ కు సంబంధించి షాకింగ్ అంశాలు వెలుగు చూసినట్లుగా తెలుస్తోంది.
అనంత పద్మనాభస్వామి ఆలయ గుట్టల వద్ద ఒక యువతి.. ఒక యువకుడు దారుణ హత్యకు గురయ్యారు. వీరిని భారీ బండరాయితో మోది హత్యకు చేసినట్లుగా తెలుస్తోంది. హత్యకు గురైన యువకుడ్నిపాతికేళ్ల అంకిత్ సాకేత్ గా గుర్తించారు. ఇతడిది మధ్యప్రదేశ్ గా గుర్తించారు. హౌస్ కీపింగ్ పని చేస్తున్నాడని.. ఇతడి డెడ్ బాడీకి దగ్గర్లో ఉన్న యువతిని బిందు(25)గా గుర్తించారు. ఆమెది ఛత్తీస్ గఢ్ కాగా.. ఎల్ బీ నగర్ నివాసిగా చెబుతున్నారు. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆమె కనిపించకుండా పోయిందని జనవరి మూడో తేదీన ఆమె భర్త పోలీసులకు కనిపించటం లేదని కంప్లైంట్ ఇచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్న వేళలో.. ఆమె దారుణ హత్యకు గురైన వైనం వెలుగు చూసింది.
విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న అనధికార సమాచారం ప్రకారం భర్త నుంచి వచ్చేసిన బిందు.. ప్రియుడి వద్ద ఉన్నట్లుగా చెబుతున్నారు. అతడితో కలిసి వచ్చి ఒక రూంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే.. ఈ ప్రియుడికి తెలీకుండా మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉండటం.. ఆ విషయంలో జరిగిన రచ్చలోనే ఈ డబుల్ మర్డర్ జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే.. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు రావాల్సి ఉంది. పోలీసులు సైతం ఈ కథనాన్ని ధ్రువీకరించాల్సి ఉంది. ఏమైనా..ఈ జంట హత్యల వ్యవహారం మాత్రం కచ్ఛితంగా సంచలనంగా మారుతుందన్న మాట వినిపిస్తోంది.