Begin typing your search above and press return to search.

మేటర్ సీరియస్.. పెద్ద పెద్ద జాబ్స్ చేస్తూ ఇవేమి పనులండీ?

ఇందులో భాగంగా... ఇప్పటికీ వర్క్ ఫ్రం హోం చేస్తున్న కొంతమంది ఉద్యోగులు కంపెనీలను సులువుగా మోసం చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   15 Jun 2024 3:34 PM GMT
మేటర్  సీరియస్.. పెద్ద పెద్ద జాబ్స్  చేస్తూ ఇవేమి పనులండీ?
X

శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయలనేది సామెత. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి.. చివర్లో మాట్లాడుకుందాం! ప్రస్తుతం పలు కంపెనీలకు ఒక కొత్త సమస్య వచ్చి పడింది. ఇందులో భాగంగా... ఇప్పటికీ వర్క్ ఫ్రం హోం చేస్తున్న కొంతమంది ఉద్యోగులు కంపెనీలను సులువుగా మోసం చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఈ వ్యవహారంపై కంపెనీలు సీరియస్ గా రియాక్ట్ అవుతున్నాయి. ఈ విషయం తెలిసిన, తెలుసుకున్న అనంతరం మరో మాట లేకుండా, వివరణకు అవకాశం ఇవ్వకుండా, డిస్కషన్స్ కి తావులేకుండా నేరుగా ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాయి. దీంతో... కార్పొరేట్ ప్రపంచంలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా నడుస్తుంది.

అవును... కంపెనీని బోల్తా కొట్టించడానికి కొంతమంది ఉద్యోగులు అతి తెలివి ఉపయోగిస్తున్నారు! ఇందులో భాగంగా మౌస్ జిగ్లర్లను ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఇలాంటి పనులకు పాల్పడుతున్న ఉద్యోగులపై అమెరికాలోని ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆన్ లైన్ బ్యాంకింగ్ వంటి సేవలను అందిస్తున్న వెల్స్ ఫార్గో కఠిన చర్యలు తీసుకుంది.

ఇది అమెరికాలోని దిగ్గజ బ్యాంకుల్లో ఒకటి. ఇలాంటి సంస్థల్లో పనిచేస్తూ కూడా పలువురు ఉద్యోగులు ఈ తరహా పనులకు పాల్పడ్డారంట. దీంతో.. ఇంటి నుంచి పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులు మౌస్ జిగ్లింగ్ కు పాల్పడుతున్న వారిని విధుల నుంచి తొలగించింది. అనైతిక ప్రవర్తన విషయంలో ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది.

"మౌస్ జిగ్లింగ్‌" అంటే ఏమిటి?

సాధారణంగా వర్క్ ఫ్రం హోం చేస్తున్న సమయంలో ఇతర పనిలో మునిగిపోయినప్పుడు కంప్యూటర్ స్లీప్ మోడ్ లోకి వెళ్తుంది. అయితే... ఆయా పనులు చేస్తున్న సమయంలోనూ కంప్యూటర్ స్లీప్ మోడ్ లోకి వెళ్లకుండా మౌస్ జిగ్లర్లను వాడుతూ కొంతమంది ఉద్యోగులు కంపెనీలను మభ్య పెడుతున్నారు.

ఇది సదరు ఉద్యోగి కంప్యూటర్ ముందు ఎంతసేపు లేకపోయినా స్క్రీన్ ఆఫ్ అయిపోకుండా ఉంటుంది. దీంతో.. ఉద్యోగి కంప్యూటర్ ముందే ఉండి పనిచేస్తున్నాడని కంపెనీ భావిస్తుందనేది వీరి నమ్మకం! అయితే... ఉద్యోగి ఇన్ని తెలివి తేటలు చూపిస్తుంటే.. సదరు కంపెనీలు ఇంతకంటే ఎక్కువ చూపిస్తున్నాయంట!

ఇలాంటి విషయాలను పసిగట్టడానికి వారి సొల్స్యూషన్స్ వారికి ఉన్నాయని అంటున్నారు. శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలన్నమాట!