Begin typing your search above and press return to search.

ఆ 'సిరా' ఎలా తయారవుతుందో మీకు తెలుసా ?

సిల్వర్ నైట్రేట్ అనే రసాయనంతో ఈ ఇంక్ ను తయారు చేస్తారు. ఈ సిరాలో 7.25 శాతం సిల్వర్ నైట్రేట్ ను కలుపుతారు.

By:  Tupaki Desk   |   12 May 2024 10:30 AM
ఆ సిరా ఎలా తయారవుతుందో మీకు తెలుసా ?
X

ఓటు వేయగానే మన ఎడమ చేయి చూపుడు వేలు మీద సిరా పెట్టడం అందరికీ తెలిసిందే. ఓటు వేశావా అని అడిగితే మన వేలును చూయిస్తాం. ఓటేసిన సెలబ్రిటీల నుండి సామాన్యుల వరకు అందరూ తమ ఎడమచేయి చూపుడు వేలును మీడియాకు చూయించి ఫోటోలు, వీడియోలకు ఫోజులివ్వడం విదితమే. మరి మన వేలికి పెట్టే సిరా ఎలా తయారవుతుందో మీకు తెలుసా ?

1962లో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో తొలిసారి ఇలా సిరా గుర్తును పెట్టడం మొదలుపెట్టారు. ప్రధానంగా దొంగఓట్లను నివారించడంలో భాగంగా దీనిని మొదలుపెట్టారు. ఆ తర్వాత పోలియో చుక్కలు వేసిన పిల్లలకు కూడా దీనిని వాడడం మొదలుపెట్టారు.

సిల్వర్ నైట్రేట్ అనే రసాయనంతో ఈ ఇంక్ ను తయారు చేస్తారు. ఈ సిరాలో 7.25 శాతం సిల్వర్ నైట్రేట్ ను కలుపుతారు. నేషనల్ ఫిజికల్ ల్యాబోరేటరీస్ ఫార్మూలాతో సిరా ఉత్పత్తిని మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ (మైలాక్) సంస్థ ప్రారంభించింది. దేశంలోని పలు రాష్ట్రాల అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు ఈ మైలాక్ సంస్థ తయారు చేసిన సిరాను ఎన్నికల కమీషన్ ఉపయోగిస్తుంది . మైలాక్ తయారు చేసే ఒక్క బాటిల్ లో 10 మి.లీ.సిరా ఉంటుంది. దీని ద్వారా 700 మంది ఓటర్ల వేళ్లకు మార్క్ వేయవచ్చు. ఒక్క బాటిల్ ధర రూ.160 నుండి రూ.170 మధ్య ఉంటుందని సమాచారం.