Begin typing your search above and press return to search.

లవ్ సింబల్ హిస్టరీ తెలుసా?

అయితే... అసలు ఈ సింబల్ ఎప్పుడు మొదలైంది.. ఎక్కడ మొదలైంది.. ఎలా మొదలైంది అనేది ఇప్పుడు చూద్దాం...!

By:  Tupaki Desk   |   14 Feb 2024 1:47 PM GMT
లవ్  సింబల్  హిస్టరీ తెలుసా?
X

ప్రేమకు లిపి లేని భాష "హార్ట్ సింబల్" అని చెప్పొచ్చు! ప్రేమను వ్యక్తపరచడానికి, ప్రేమ అనే పదాన్ని పలకడానికి శబ్ధం అవసరం లేకుండా చెప్పేదే "లవ్ సింబల్". హృదయం ఆకారంలో ఉండే ఈ సింబల్ ని చూడగానే హృదయానికి ఏదో తెలియని ఫీలింగ్ అనిపిస్తుంటుంది! అయితే... అసలు ఈ సింబల్ ఎప్పుడు మొదలైంది.. ఎక్కడ మొదలైంది.. ఎలా మొదలైంది అనేది ఇప్పుడు చూద్దాం...!


అవును... ప్రేమకు గుర్తుగా ఉండే "లవ్ సింబల్" ని మొదటిసారిగా 1250 సంవత్సరంలో "రోమన్ డి లా పోయిర్" రాసిన ప్రేమ కావ్యంలో దీనిని ఉపయోగించారు. ఇందులో ఉన్న పెయింటింగ్ లో... మోకరిల్లుతున్న ప్రేమికుడు తన హృదయాన్ని ఒక ఆడపిల్లకు అందజేస్తాడు. మధ్యయుగ శరీర నిర్మాణ సంబంధమైన వర్ణనలకు అనుగుణంగా ఈ పిక్ లో గుండె పైన్ కోన్‌ ను ఆకారాన్ని పోలి ఉంటుంది.

ఈ సమయంలో ఈ ఫోటోను కలిగి ఉన్న మాన్యుస్క్రిప్ట్ ఫ్రెంచ్ శీర్షిక ఇంగ్లిష్ లోకి "నోవెల్ ఆఫ్ ది పియర్"గా అనువదించబడింది. అనంతరం 1305లో జియోట్టో తన పెయింటింగ్‌ లో స్క్రోవెగ్ని చాపెల్ తన గుండెను జీసస్ క్రైస్ట్ కు ఇస్తున్నట్లుగా ఉంటుంది. ఇప్పుడున్న సింబల్ ను దాదాపు తలకిందులుగా చేసినట్లుగా ఈ ఆకారాలు ఉండేవి! ఈ క్రమంలో జియోట్టో పెయింటింగ్ తర్వాత వచ్చిన చిత్రకారులపై తీవ్ర ప్రభావం చూపించింది.

వాలంటైన్ కి గుర్తుగా...!:

అప్పట్లో రోమన్ క్లాడియస్ పరిపాలించే సమయంలో తన సైనికులెవ్వరికీ పెళ్లి కాకూడదనే ఆలోచనతో ఉండేవాడంట. అయినప్పటికీ చాలా మంది సైనికులు ప్రేమలో పడ్డటం వంటివి చేసేవారంట. అయితే ఈ విషయం రాజుకు తెలిస్తే మాత్రం చంపేస్తాడనే భయం వారిని వెంటాడటంతో... వారి వారి ప్రేమను లోలోపలే దాచుకునేవారంట.

ఇలా తమ ప్రేమను తమలోనే చంపేసుకుంటున్న కొన్ని వేల మంది సైనికుల ఇబ్బంది విషయం వాలెంటైన్ అనే ఒక సెయింట్ కు తెలిసిందని.. దీంతో ఆయన సైనికులకు ధైర్యం ఇచ్చి.. రాజుకు తెలియకుండా సైనికులకు వారు ఇష్టపడ్డ అమ్మాయిలతో రహస్యంగా పెళ్లిళ్లు జరిపించేవారట. ఈ క్రమంలో సైనికుల్లో మార్పును రాజు గమనించాడట.

దీంతో అనుమానం వచ్చి విచారణ చేయగా... అసలు విషయం తెలుసుకున్నాడట. దిఈంతో... వెంటనే సైనికులకు వివాహాలు చేయించిన వాలెంటైన్‌ ను జైల్లో పెట్టించి, ఉరి శిక్ష విధించాడు! అయితే తాను మరణించే ముందు చివరగా ఒక సందేశాన్ని ఇవ్వాలనుకున్నాడు వాలెంటైన్. కానీ ఎలా తన సందేశాన్ని పంపాలో తెలియలేదు!

అయితే ఈ సమయంలో ఆయన ఉండే కారాగారం దగ్గర.. రావి ఆకులు మాదిరిగా ఉండే సేల్ఫియం అనే చెట్టు ఆకులు పడి ఉండటంతో వాటిపై తన సందేశం రాశాడట. అందులో భాగంగా... సైనికుల జీవితాల్లో ప్రేమను నింపేందుకే వారికి వివాహాలు చేసినట్లు తెలిపిన వాలంటైన్... ప్రతి మనిషికి ప్రేమ అవసరం.. అది లేకపోతే మనిషి మనుగడ ప్రశ్నార్ధకం.. ప్రేమను విశ్వవ్యాప్తం చేయండి అంటూ ఆ ఆకుపై బొగ్గుతో రాసి తన చివరి సందేశాన్ని పంపుతాడు.

వాటిని కిటికీలో నుంచి బయటకు వేయడంతో అవి రోమ్ లోని ప్రజలకు చేరుతాయి. ఈ క్రమంలో వాలంటైన్ ని ఉరి తీస్తారు. అయితే... అతడు చనిపోయినా కూడా అతను చివరగా ఇచ్చిన సందేశం రాసిన ఆకులు ఇప్పుడు మన లవ్ సింబల్ మాదిరిగా ఉండేవని.. దీంతో ప్రేమకు చిహ్నాన్ని ఆ ఆకుల రూపం మారి.. ఇప్పుడు ఉపయోగించే లవ్ సింబల్ కు పుట్టుక అయ్యిందని చెబుతుంటారు.