Begin typing your search above and press return to search.

చంద్రయాన్ -4 ఎక్కడ దిగుతుందో తెలుసా?

చంద్రయాన్ 3 స్ఫూర్తితో చంద్రయాన్ 4 కూడా సక్సెస్ చేయాలని భావిస్తోంది.

By:  Tupaki Desk   |   13 May 2024 12:52 PM GMT
చంద్రయాన్ -4 ఎక్కడ దిగుతుందో తెలుసా?
X

అంతరిక్ష రంగంలో మనదేశ ఖ్యాతి ఇనుమడిస్తూనే ఉంది. చంద్రయాన్ -3తో మన సత్తా ప్రపంచానికి తెలిసింది. చంద్రయాన్ 3 విజయవంతంతో అదే ఊపులో మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని ఇస్రో ఉవ్విళ్లూరుతోంది. చంద్రయాన్ 3 స్ఫూర్తితో చంద్రయాన్ 4 కూడా సక్సెస్ చేయాలని భావిస్తోంది. దీని కోసం కసరత్తు ముమ్మరం చేస్తోంది. పరిశోధనలు వేగవంతం చేసింది.

చంద్రయాన్ -3ని శివశక్తి దగ్గర దించింది. విక్రమ్ ల్యాండర్ దిగిన దక్షిణ ధ్రువంలో నీటి జాడలు కనుగొంది. దీంతో అంతరిక్ష యానంలో ఎంతో పురోగతి సాధించింది. అక్కడ కూడా నీటి జాడలు ఉన్నట్లు గుర్తించింది. దీని వల్ల ఆ ప్రదేశంపై అందరికి ఆసక్తి పెరిగింది. మన పరిశోధనల ఫలితంగా మనకు ఎన్నో విషయాలు తెలియడంతో ఇప్పుడు చేపట్లే చంద్రయాన్ 4 పరిశోధనపై నిజంగానే ఆసక్తి పెరుగుతోంది. చంద్రయాన్ 4ను కూడా అక్కడే దింపి ప్రయోగాలు చేయాలని చూస్తోంది.

చంద్రయాన్ 4 ను కూడా విజయవంతం చేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. పరిశోధనలో ఎలాంటి లోటుపాట్లు ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ మేరకు ఆ ప్రదేశంపై అందరికి ఆసక్తి పెరడంతో మరిన్ని పరిశోధనలు చేసి అక్కడి పరిస్థితులను అవగాహన చేసుకోవాలని ఇస్రో ఆలోచిస్తోంది. చంద్రయాన్ 4 విజయంతో మరిన్ని కొత్త విషయాలు కనుగొనాలని చూస్తోంది.

చంద్రుడిపై శిలలు, మట్టిని గుర్తించారు. వాటితో మానవ మనుగడ సాధ్యమవుతుందా? కాదా? అనేది తేలాల్సి ఉంది. చంద్రయాన్ 3 పరీక్ష దాదాపు 15రోజుల పాటు కొనసాగినా ఇంకా కొన్ని విషయాలు తెలియకుండా పోయాయి. అందుకే చంద్రయాన్ 4 చేపట్టి నూతన ఆవిష్కరణలు తీసుకురావాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుని ముందుకు వెళ్తోంది.

ఇప్పటికే మనం అంతరిక్ష ప్రయోగాల్లో మంచి విజయాలు అందుకున్నాం. మనదేశానికి చెందినవే కాకుండా ఇతర దేశాల ఉపగ్రహాలను సైతం విజయవంతంగా నింగిలోకి పంపాం. అదే స్ఫూర్తితో ఇప్పుడు చంద్రయాన్ 4 కూడా సక్సెస్ చేసి మన ఖ్యాతిని ఇనుమడింపచేయాలని చూస్తోంది. దీని కోసమే నిరంతరం శ్రమిస్తోంది.