Begin typing your search above and press return to search.

బంగ్లాదేశ్ తరహాలో భారత్ లో కుట్రకు తెర లేపిన డ్రాగన్ ?

గత ఐదారేళ్లుగా సరిహద్దులల్లో చైనా భారత్ ని ఎంత ఇబ్బంది పెట్టాలో అన్నీ పెడుతోంది. భారత్ భూభాగాలను ఆక్రమించుకోవాలని చూస్తోంది.

By:  Tupaki Desk   |   17 Aug 2024 12:30 PM GMT
బంగ్లాదేశ్ తరహాలో భారత్ లో కుట్రకు తెర లేపిన డ్రాగన్ ?
X

బంగ్లాదేశ్ లో ఎవరూ ఊహించని విధంగా షేక్ హసీనా ప్రభుత్వం కుప్ప కూలింది. ఆమె మాజీ అవుతారని కనీసం ఆమెకు కూడా తెలియదు. అంత ఘోరంగా దేశం విడిచి పారిపోయి భారత్ కి శరణార్ధిగా వస్తాను అని కలలో కూడా ఆమె ఊహించలేదు. కానీ అలా జరిగిపోయింది. దాని వెనక చైనా హస్తం ఉందని ప్రచారం సాగింది. అలాగే అమెరికా హ్యాండ్ కూడా ఉందని ఆరోపణలు వినిపించాయి.

ఒక రిజర్వేషన్ అంశం పటిష్టమైన షేక్ హసీనా ప్రభుత్వాన్ని షేక్ చేసి పారేసింది. ఇక భారత్ లో కూడా అలాంటి కుట్ర జరుగుతుందా అన్న చర్చ సాగుతోంది. భారత్ లో 2014 నుంచి నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అయితే 2014లో 283 సీట్లు, 2019లో 303 సీట్లు దక్కించుకుని బలంగా ఉన్న మోడీ ప్రభుత్వం 2024లో మాత్రం 240 కే పరిమితం అయింది.

ఇక వైపు జేడీయూ మరో వైపు టీడీపీ మద్దతుతోనే ఈ ప్రభుత్వం నిలబడింది. అయితే మోడీ ప్రభుత్వం కూల్చే కుట్రకు సార్వత్రిక ఎన్నికలకు ముందే భారీ స్కెచ్ గీసింది డ్రాగన్ అని రష్యా నుంచి వెలువడుతున్న స్పుత్నిక్ సంస్థ విడుదల చేసిన ఒక సంచలన పోస్టు వివరాలను వెల్లడించింది. ఇపుడు ఆ పోస్ట్ జాతీయ అంతర్జాతీయ స్థాయిలోనే వైరల్ అవుతోంది.

మోడీ సర్కార్ ని కూలగొట్టాలని డ్రాగన్ చూస్తోంది అని అంటున్నారు. అమెరికా బాటలో చైనా నడుస్తోందని అంటున్నారు. ప్రపంచాన్ని తన గుప్పిట పెట్టుకోవడానికి అమెరికా ప్రపంచ దేశాలను తన సామంతులుగా మార్చుకోవడం, అలా కుదరని చోట ఆయా ప్రభుత్వాలను కూల్చడం చేస్తూ వస్తోంది. ఇపుడు ఆసియాలో పెత్తనం కోసం ఆరాటపడుతున్న డ్రాగన్ కూడా తనకు పోటీగా అత్యంత ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న భారత్ ని కుట్ర ద్వారా దెబ్బ తీయాలని చూస్తోంది అని అంటున్నారు.

గత ఐదారేళ్లుగా సరిహద్దులల్లో చైనా భారత్ ని ఎంత ఇబ్బంది పెట్టాలో అన్నీ పెడుతోంది. భారత్ భూభాగాలను ఆక్రమించుకోవాలని చూస్తోంది. ఇదే క్రమంలో మోడీని గద్దె దించడానికి కూడా కుట్ర పన్నింది అని ఆ పొస్ట్ వెల్లడిస్తోంది. గతంలో జరిగిన అనేక ఉద్యమాలు మోడీని ఇంటికి పంపడానికి కొన్ని శక్తులు ప్రేరేపిస్తే వాటి వెనక హస్తం వ్యూహం మాత్రం చైనాదే అని అంటున్నారు.

మరో ఇక ఎన్నికల తరువాత మోడీ ప్రభుత్వం ఏర్పాటు కాకుండా కూడా చూసిన దాఖలాలూ ఉన్నాయని అంటున్నారు. ఈ రోజుకీ మోడీ ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉంది. మరి రష్యా పొస్ట్ కనుక నిజం అయితే భారత్ లోని ప్రభుత్వానికి ప్రమాదం పొంచి ఉందనే అనుకోవాలి.

తొందరలో జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు ఉన్నాయి. అలాగే దేశంలో హర్యానా మహారాష్ట్ర సహా అనేక రాష్ట్రాలలో ఎన్నికలు ఉన్నాయి. మరి ఈ ఎన్నికలు సజావుగా సాగుతాయా లేక ఘర్షణాత్మకం అవుతాయా అంటే దేశంలో అశాంతిని రేపుతూ గొడవలు సృష్టించేందుకు డ్రాగన్ కుట్ర చేస్తోంది అన్నదే ఆ పొస్ట్ కధనం కాబట్టి భారత్ ఈ విషయంలో కౌంటర్ స్ట్రాటజీ ఏమి చేస్తుంది అన్నది చూడాలని అంటున్నారు.

బంగ్లాలో షేక్ హసీనా ప్రభుత్వం భారత్ కి సన్నిహితమైన ప్రభుత్వం. ఆ విధంగా భారత్ ని పరోక్ష దెబ్బ తీయడంలో విజయం సాధించిన శత్కులే ఇపుడు దేశంలో కూడా అలజడులు రేపినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు.