Begin typing your search above and press return to search.

22 ఏళ్ల ప్రియుడిని తండ్రిని చేయనున్న 39 ఏళ్ల మోడల్!

అమెరికన్ బాస్కెట్ బాల్ ప్లేయర్ జాలెన్ గ్రీన్.. మోడల్ డ్రాయా మిచెల్ తో డేటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   9 March 2024 6:49 PM IST
22 ఏళ్ల ప్రియుడిని తండ్రిని చేయనున్న 39 ఏళ్ల మోడల్!
X

అమెరికన్ బాస్కెట్ బాల్ ప్లేయర్ జాలెన్ గ్రీన్.. మోడల్ డ్రాయా మిచెల్ తో డేటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆమె ఒక విషయాన్ని వెల్లడించారు. ఇందులో భాగంగా ఆమె గర్భవతి అని ఇన్ స్టాలో వెల్లడించారు. ఇందులో వింతేముంది అనుకునేవారికి.. ఆమె వయసు 39 కాగా.. అతడి వయసు 22 ఏళ్లు అని తెలియడంతో షాకవుతున్నారు.

అవును... డ్రయా మిచెల్ – జాలెన్ గ్రీన్ లు పేరెంట్స్ కాబోతున్నారు! ఇందులో భాగంగా తాను గర్భవతి అని డ్రయా మిచెల్ ఆన్ లైన్ వేదికగా ప్రకటించింది. ఈ విషయంపట్ల తనకు చాలా సంతోషంగా ఉందని ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా... తాను గ్రీన్ తో కలిసి ఆడపిల్లకు జన్మనివ్వబోతున్నట్లు ప్రకటిస్తూ... బేబీ బంప్ తో ఉన్న ఫోటోలను షేర్ చేసింది మిచెల్!

ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే... డ్రయా మిచెల్ కు ఇప్పటికే ఇద్దరు కుమారులున్నారు. వారికి గ్రీన్ తండ్రి కాదు.. అంతక ముందున్న బాయ్ ఫ్రెండ్స్ తండ్రులు కాగా.. ఇప్పుడు పుట్టబోయే బిడ్డకు మాత్రం గ్రీనే తండ్రి అని మిచెల్ అధికారికంగా ప్రకటించారు! ఇక ఇప్పటికే ఉన్న ఇద్దరు కుమారులకు ఇద్దరు వేరు వేరు తండ్రులు ఉండటం గమనార్హం!

ఇందులో భాగంగా తన మొదటి కొడుకు 2002లో జన్మించినట్లు చెబుతున్నారు. అంటే.. మిచెల్ మొదటి కుమారుడి వయసు ఇప్పుడున్న బాయ్ ఫ్రెండ్ గ్రీన్ కి దాదాపు సమాన వయసన్నమాట. ఇక అతడి తండ్రి గిల్బర్ట్ ఆరేనాస్ అని అప్పట్లో పుకార్లు వచ్చాయి. అయితే అది వాస్తవం కాదని మిచెల్ ధృవీకరించారు.

ఇదే సమయంలో తన పెద్ద కుమారుడి తండ్రి పెన్సిల్వేనియాకు చెందిన వాడని చెబుతుంటారు. అప్పట్లో అతను కొంతకాలం జైలు జీవితం గడిపాడని కథనాలొస్తుంటాయి. ఇక రెండో కుమారుడికి తండ్రి స్టార్ ప్లేయర్ ఓర్లాండో స్కాండ్రిక్ అని చెబుతారు. కార్నర్ బ్యాక్ ఆడే స్కాండ్రిక్ తో ఆమె 2016లో కుమారుడికి జన్మనిచ్చింది.

ఈ క్రమంలో తాజాగా తాను మరోసారి తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన మిచెల్... ఈసారి పుట్టబోయేది ఆడపిల్ల అని, ఆమెకు తండ్రి జాలెన్ గ్రీన్ అని ప్రకటించింది!