Begin typing your search above and press return to search.

డాక్టర్ జె. నాయుడు.. అమెరికాలో ఒక వీధికి పేరు ఇప్పుడు

అమెరికాలో వైద్యుడిగా జె.నాయుడు చేసిన సేవలకు గుర్తింపుగా ఒక వీధికి డాక్టర్.జె. నాయుడు పేరును ఒక వీధికి పెడుతూ నిర్ణయం తీసుకున్నారు.

By:  Tupaki Desk   |   15 Jan 2024 4:24 AM GMT
డాక్టర్ జె. నాయుడు.. అమెరికాలో ఒక వీధికి పేరు ఇప్పుడు
X

అవును.. మీరు చదివింది నిజం. అమెరికాలోని ఒక వీధికి ఒక తెలుగు వ్యక్తి.. అందునా అనంతపురానికి చెందిన ఒక పెద్దాయన పేరు పెట్టేస్తూ స్థానిక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆసక్తికరంగా మారింది. మనోడికి దక్కిన అరుదైన గౌరవంగా దీన్ని చెప్పాలి. ప్రముఖ వైద్యుడిగా సుపరిచితుడైన ఆయనే డాక్టర్ జె. నాయుడు అలియాస్ బావికాటి జయరాంనాయుడు. వైద్యుడిగా ఆయన చేసిన సేవకు గుర్తింపుగా అయనకు ఈ అరుదైన గౌరవాన్ని ఇస్తూ గౌరవించారు.

అరవైల చివర్లో ఉమ్మడి ఏపీకి చెందిన పలువురు అమెరికాకు వెళ్లటం.. అక్కడే స్థిరపడిపోవటం తెలిసిందే. అలా వెళ్లిన తొలి తరం తెలుగు వాళ్లలో బావికాటి జయరాం ఒకరు. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం పెద్దకొట్లాలపల్లికి చెందిన ఆయన ఇప్పుడు టెక్సాస్ లో ఉంటున్నారు. 1968లో ఆయన అమెరికాకు వెళ్లారు.

గుండె వైద్య నిపుణుడిగా ఆయనకు మంచి పేరుంది. అంతేకాదు.. గుండె సంబంధిత వైద్యం కోసం అమెరికాలో 300 బెడ్ల ఆసుపత్రిని నిర్మించారు. అదే సమయంలో సొంతూరులో తన తల్లిదండ్రుల గుర్తుగా(బావికాటి రంగప్ప, లక్ష్మమ్మ ) పేరు మీద ఒక ట్రస్టును ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. అమెరికాలో వైద్యుడిగా జె.నాయుడు చేసిన సేవలకు గుర్తింపుగా ఒక వీధికి డాక్టర్.జె. నాయుడు పేరును ఒక వీధికి పెడుతూ నిర్ణయం తీసుకున్నారు.

స్థానిక ప్రభుత్వం తమ వాడికి ఇచ్చిన గౌరవానికి పెద్దకొట్టాలపల్లి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఆ గ్రామం ఏమిటి? రెండు తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు వారంతా గర్వపడాల్సిన అంశంగా చెప్పాలి. అంతేకాదు.. వైద్య రంగంలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా టెక్సాస్ మెడికల్ బోర్డులో సభ్యుడిగా నియమిస్తూ నిర్ణయం తీసుకోవటం గమనార్హం.