సమాజాన్ని మార్చే సత్తా సినిమాకి ఉంది!
జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
By: Tupaki Desk | 9 Oct 2024 6:51 AM GMTసినిమా నటుల్ని రాజకీయాల్లోకి లాగొద్దు అని తరుచూ వింటుంటాం. సినిమా వేరు..రాజకీయం వేరు! అంటుంటారు. అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ ఈ మాట కామన్ గా వినిపిస్తుంటుంది. అలాగే సినిమాని సినిమాగా చూడాలి తప్ప! సినిమాల్ని...సినిమాలో పాత్రల్ని స్పూర్తిగా తీసుకుని ముందుకెళ్లమని ఎవరూ చెప్పరు. సినిమా అనేది కేవలం వినోదం మాత్రమే. సినిమా వేరు..నిజ జీవితం వేరు అన్నది వాస్తవం.
మరి సమాజాన్ని మార్చే సత్తా సినిమాకి ఉందా? అంటే ఉందనే అనే సమాధానం వచ్చింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి. జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 'భాష , ప్రాంతంతో సంబంధం లేకుండా సినిమాల్నిరూపొందిస్తుంది భారతీయ చిత్ర పరిశ్రమ. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద పరిశ్రమ మాత్రమేకాదు ..కళా రంగంలోనే ఎంతో వైవిధ్యమైనది.
85 మంది పురస్కారాలు అందుకున్నారు. అందులో మహిళలు కేవలం 15 మంది మాత్రమే ఉన్నారు. చిత్ర పరిశ్రమలో మహిళల్ని ప్రోత్సహించేలా భవిష్యత్ లో మరిన్ని చిత్రాలు తీయడానికి దర్శక, నిర్మాతలు ప్రయత్నించాలి. మహిళలకు ఎక్కువగా అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలి. సమాజాన్ని మార్చడంలో సోషల్ మీడియాతో పాటు సినిమా కూడా కీలకమైన పాత్ర పోషిస్తుంది` అన్నారు.
నేడు భారతీయ చిత్ర పరిశ్రమకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది. 'బాహుబలి', 'ఆర్ ఆర్ ఆర్', 'కల్కి 2898' లాంటి సినిమాలు హాలీవుడ్ మేకర్స్ ని సైతం ఎంతగానో మెప్పించాయి. వీటికంటే ముందు బాలీవుడ్ నుంచి రిలీజ్ అయిన కొన్ని చిత్రాల్ని విదేశీ దర్శకులెంతో మంది ప్రశంసించారు. ఆస్కార్ వేదికపైనా భారతీయ చిత్రాలు సత్తా చాటుతున్నాయి.