Begin typing your search above and press return to search.

షార్క్ చేపలపై డ్రగ్స్ ఎఫెక్ట్... 13 చేపల్లో కొకైన్ ఆనవాళ్లు!

మనిషి మనుగడకు ప్రకృతి సహకరిస్తుంటే.. పశుపక్ష్యాదులు, సముద్రజీవులు, పురుగూ పుట్రా కూడా సహాయ సహకారాలు అందిస్తుంటే

By:  Tupaki Desk   |   23 July 2024 3:22 PM GMT
షార్క్ చేపలపై డ్రగ్స్ ఎఫెక్ట్... 13 చేపల్లో కొకైన్ ఆనవాళ్లు!
X

మనిషి మనుగడకు ప్రకృతి సహకరిస్తుంటే.. పశుపక్ష్యాదులు, సముద్రజీవులు, పురుగూ పుట్రా కూడా సహాయ సహకారాలు అందిస్తుంటే.. మనిషి మాత్రం ఆ ప్రకృతి, తనకు సహరిస్తున్న జీవాల నాశానాన్ని కోరుకుంటున్నాడని అంటారు. ఈ కామెంట్ కు బలం చేకూర్చే మరో తాజా సంఘటన తెరపైకి వచ్చింది. షార్క్ చేపలపై మాదకద్రవ్యాల ప్రభావం పడింది.

అవును... ఇంతకాలం ప్లాస్టిక్ వాడకం ఎక్కువవ్వడం, కాలుష్యం పెరిగిపోవడం వంటి కారణాలతో సముద్ర జీవుల ప్రాణాలతో చెలగాటమాడిన మనిషి.. ఇప్పుడు వాటిపై డ్రగ్స్ విషాన్ని కూడా చిమ్ముతున్నాడు. తాజాగా బ్రెజిల్ తీరంలోని కొన్ని రకాల చేపల్లో భారీ ఎత్తున మాదక ద్రవ్యాల ఆనవాళ్లు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో... ఈ విషయం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.

వివరాళ్లోకి వెళ్తే... ఫ్లోరెడా, దక్షిణ అమెరికా, మధ్య అమెరికా తీరాలకు డ్రగ్స్ ని చేరవేయడానికి సముద్ర మార్గాన్ని ఎంచుకున్నారు. ఈ నేపథ్యంలో అధికారుల దాడులు జరిగే సమయంలో... టన్నుల కొద్దీ కొకైన్ ప్యాకెట్లను సముద్రంలో వేస్తుండటం వల్ల వాటి ప్రభావానికి ఈ చేపలు గురై ఉంటాయని అంటున్నారు. దీంతో... మనుషులకే కాదు మూగజీవాలకు కూడా ఈ డ్రగ్స్ ప్రాణాంతకంగా మారుతున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో... బ్రెజిల్ లోని ఓస్వాల్డో క్రూజ్ ఫౌండేషన్ ఇటీవల ఒక పరిశోధన చేసింది. ఇందులో భాగంగా... డ్రగ్స్ కారణంగా సముద్రపు జలాలు కలుషితమైతే.. అవి షార్క్ చేపలపై ఏ మేరకు ప్రభావం చూపిస్తాయనే అంశంపై అధ్యయనం నిర్వహించింది. దీని కోసం 13 షార్క్ చేపలను చిన్న పడవల నుంచి కనుగోలు చేశారు. ఇవి జీవితం మొత్తం బ్రెజిల్ తీరంలోనే గడుపుతాయని చెబుతున్నారు.

ఈ సమయంలో ఆ 13 షార్క్ చేపలపైనా శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. ఇందులో భాగంగా... వాటి కండరాలు, లివర్ పై ల్విక్విడ్ క్రోమోటోగ్రఫీ అనే పరీక్షను నిర్వహించారు. దీంతో... ఈ పరీక్షల్లో 13 చేపల్లోనూ కొకైన్ ఆనవాళ్లు ఉన్నట్లు తేలిందని చెబుతున్నారు. ఫలితంగా... తొలిసారి షార్క్ శరీరాల్లో కొకైన్ ఆనవాళ్లు గుర్తించిన అధ్యయనంగా ఇది నిలిచింది.