Begin typing your search above and press return to search.

అలర్ట్ అలర్ట్ ఆ బ్యాంకు నాలుగు రోజుల మూత

దేశవ్యాప్తంగా 43 గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి. వీటిని రాష్ట్రానికి ఒకటి చొప్పున తగ్గించి మొత్తం 28 గ్రామీణ బ్యాంకులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

By:  Tupaki Desk   |   20 Dec 2024 9:30 PM GMT
అలర్ట్ అలర్ట్ ఆ బ్యాంకు నాలుగు రోజుల మూత
X

దేశవ్యాప్తంగా గ్రామీణ బ్యాంకుల విలీన ప్రక్రియ తుదిదశకు చేరింది. ఒక రాష్ట్రంలో ఒకే బ్యాంకు ఉండాలనే ఉద్దేశంతో 43 గ్రామీణ బ్యాంకులను కుదించి 28 బ్యాంకులుగా ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం ఎప్పటి నుంచో కసరత్తు చేస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ వచ్చే జనవరి 1నుంచి కొత్త బ్యాంకుల కార్యకలాపాలు మొదలుపెట్టాలని సూచించింది. ఇప్పటికే మూడు దశల్లో విలీన ప్రక్రియ జరగ్గా, ఇప్పుడు నాలుగు, చివరి ప్రక్రియకు పచ్చజెండా ఊపింది. దీంతో గ్రామీణ బ్యాంకులు ఈ నెల 28 నుంచి 31 వరకు మూతపడనున్నాయి. అంటే జనవరి 25న క్రిస్మస్ సెలవు కాగా, ఆ తర్వాత రెండు రోజులు మాత్రమే గ్రామీణ బ్యాంకులు తెరవనున్నారు. చివరి నాలుగు రోజులు బ్యాంకును మూసివేయనున్నారు. ఈ నాలుగు రోజులు ఆన్ లైన్ లావాదేవీలతోపాటు యూపీఐ చెల్లంపులు, ఏటీఎంల్లో నగదు విత్ డ్రా చేసుకోవడం కూడా కుదరదని బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి. కస్టమర్లు నగదు లావాదేవీల కోసం ముందే జాగ్రత్త పడాలని 27లోగా తమ లావాదేవీలను ముగించుకోవాలని సూచించాయి.

దేశవ్యాప్తంగా 43 గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి. వీటిని రాష్ట్రానికి ఒకటి చొప్పున తగ్గించి మొత్తం 28 గ్రామీణ బ్యాంకులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తెలుగు రాష్ట్రాల్లో నాలుగు గ్రామీణ బ్యాంకులు ఉండగా, రెండు రాష్ట్రాల్లోనూ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు పనిచేస్తోంది. ఈ బ్యాంకు ప్రధాన కార్యాలయం వరంగల్లో ఉంది. కేంద్రం సూచనల ప్రకారం ఈ బ్యాంకు రెండుగా విభజిస్తున్నారు. ఏపీలో ఉన్న ఈ బ్యాంకు శాఖలన్నీ ఇకపై అదేపేరుతో కొనసాగనుండగా, తెలంగాణ రాష్ట్రంలోని బ్యాంకు శాఖలో తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంకులో విలీనమవుతాయి. అదేవిధంగా ఏపీలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు శాఖలు ఏపీజీవీబీలో విలీనం కానున్నాయి. దీంతో డిసెంబర్ 28 నుంచి 31 వరకు ఈ బ్యాంకులో ఆర్థిక లావాదేవీలు నిలిచిపోనున్నాయి.

గ్రామీణ ప్రాంతాల్లో చిన్న, సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు, చిరు వ్యాపారులకు రుణాలివ్వడానికి గ్రామీణ బ్యాంకులను ఏర్పాటు చేశారు 1976లో ఏర్పాటైన ఈ బ్యాంకింగ్ వ్యవస్థ యాజమాన్య పద్ధతులు, నిర్వహణ మిగిలిన ప్రభుత్వ రంగ, వాణిజ్య బ్యాంకులకు భిన్నంగా ఉంటుంది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో కేంద్ర ప్రభుత్వానికి 50 శాతం వాటా ఉంటుంది. మిగిలిన 50 శాతంలో స్పాన్సర్ బ్యాంకుకు 35 శాతం, రాష్ట్ర ప్రభుత్వానికి 35 శాతం వాటా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడున్న 5 బ్యాంకులు రెండింట్లో విలీనం కానుందన వినియోగదారులు ముందుగా తమ ఆర్థిక కార్యకలపాలను ప్లాన్ చేసుకోవాలని బ్యాంకు యాజమాన్యం కోరుతోంది.