Begin typing your search above and press return to search.

అమెరికా వెళ్లడానికి సరికొత్త మోసం... హైదరాబాద్ లో 7గురు అరెస్ట్!

ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య ప్రతీ ఏటా భారీగా పెరుగుతోన్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   20 Feb 2024 11:46 AM GMT
అమెరికా వెళ్లడానికి సరికొత్త మోసం... హైదరాబాద్ లో 7గురు అరెస్ట్!
X

ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య ప్రతీ ఏటా భారీగా పెరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రధానంగా భారతీయ విద్యార్థులకు ఈ విషంలో ఫస్ట్ ప్రిఫరెన్స్ అమెరికా అనే చెబుతారు! ఈ క్రమంలో ఉన్నత చదువుల కోసం యూఎస్ వెళ్లాలనే ఈ డిమాండ్‌ ను దృష్టిలో ఉంచుకుని, యూఎస్ వీసాలు పొందడానికి లాంగ్వేజ్ పరీక్షలను క్లియర్ చేయడంలో మోసపూరిత పనులు చేస్తున్న గ్రూప్ ఒకటి ఇప్పుడు హైదరాబాద్‌ లో వెలుగు చూసింది.

అవును... ఇంటర్నేషనల్ యూనివర్శిటీలలో ఎంట్రన్స్ కోసం నిర్వహించే డ్యూలింగ్‌ పరీక్షల్లో మాల్‌ ప్రాక్టీస్‌ కి పాల్పడుతున్న ఏడుగురు వ్యక్తులను హైదరబాద్ లోని ఎల్బీనగర్‌ ఎస్‌.వో.టీ పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా హయత్‌ నగర్‌ లోని ఒక లాడ్జిలో గది అద్దెకు తీసుకుని మాల్‌ ప్రాక్టీస్‌ కు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారని తెలుస్తుంది. దీంతో ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.

వివరాళ్లోకి వెళ్తే... అమెరికా తోపాటు ఆస్ట్రేలియా, ఐర్లాండ్ లలోని వివిధ యూనివర్శిటీల్లో చేరాలనుకునే వారి కోసం డ్యూలింగ్ పరీక్ష నిర్వహిస్తుంటారు. ఆన్‌ లైన్‌ లో ఈ పరీక్షను రాయాల్సిన వారికి బదులుగా మరో ఏడుగురు రాస్తున్నారు! దీంతో ఈ విషయంపై నిర్వాహకులు స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో హోటల్‌ పై దాడి చేసి 7గురిని అరెస్టు చేసినట్లు తెలిపారు.

ఈ ఏడుగురు వ్యక్తులు యూఎస్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్న, విదేశీ యూనివర్సిటీల్లో ప్రవేశం పొందేందుకు ప్లాన్ చేసుకున్న ఆశావాదుల తరపున ఈ పరీక్షకు హాజరయ్యారు. ఈ క్రమంలో ఈ పరీక్ష రాసేందుకు ఒక్కో వ్యక్తి నుంచి ఐదు నుంచి పదివేల రూపాయల వరకూ వసూలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో వీరి నుంచి ఏడు మొబైల్ ఫోన్లు, ఐదు ల్యాప్‌ టాప్‌ లు, నాలుగు పాస్‌ పోర్టులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది.