Begin typing your search above and press return to search.

కొత్త రచ్చ... "ఉత్తరాది మహిళలకు 10 పెళ్లిళ్లు.. వారికి వేరే పనిలేదు"!

అదే జరిగితే... ఉత్తరాదిన ఎంపీ సీట్ల సంఖ్య పెరిగి.. దక్షిణాది ఎంపీ స్థానాల సంఖ్య తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ సమయంలో మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   14 March 2025 11:21 AM IST
కొత్త రచ్చ... ఉత్తరాది మహిళలకు 10 పెళ్లిళ్లు.. వారికి వేరే పనిలేదు!
X

కేంద్ర ప్రభుత్వం, తమిళనాడు సర్కార్ మధ్య గత కొని రోజులుగా జాతీయ విద్యా విధానాన్ని (ఎన్.ఈ.పీ) అమలు విషయంలో తీవ్ర ఘర్షణ జరుగుతోన్న సంగతి తెలిసిందే! ఈ విషయంలో అధికార డీఎంకే వర్సెస్ ఎన్డీయే కూటమి పార్టీల మధ్య మాటల యుద్ధాలు పీక్స్ కి చేరుకుంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా తమిళనాడు సీనియర్ మంత్రి దురై మురుగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవును... కేంద్ర ప్రభుత్వానికి, తమిళనాడుకు మధ్య గత కొన్ని రోజులుగా హిందీ భాష విషయంలో తీవ్ర మాటల యుద్ధాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై డీఎంకే సర్కార్ ఘాటుగా రియాక్ట్ అవుతోంది. ఇందులో భాగంగా... తాజాగా ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ లో రూపాయి సింబల్ ను తొలగించారు. ఆ స్థానంలో "రూ" అనే అర్ధం వచ్చేలా తమిళ అక్షరాన్ని చేర్చారు.

ఇదే సమయంలో... జనాభా దామాషా ప్రకారం దేశంలో లోక్ సభ నియోజకవర్గలా పునర్విభజన చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందనే వార్తలు తెరపైకి వచ్చాయి. దీనిపై డీఎంకే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. అదే జరిగితే... ఉత్తరాదిన ఎంపీ సీట్ల సంఖ్య పెరిగి.. దక్షిణాది ఎంపీ స్థానాల సంఖ్య తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ సమయంలో మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా స్పందించిన డీఎంకే నేత, మంత్రి దురై మురుగన్... ఉత్తర భార్రతదేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన మహిళలు అనేక మంది భర్తలను కలిగి ఉండే సంస్కృతిని కలిగి ఉంటారని పేర్కొన్నారు. తమిళ ఆచారాల వలే కాకుండా... ఉత్తర భారత సంస్కృతిలో బహుభార్యత్వం, బహు భర్తృత్వం ఉన్నాయని.. ఒక స్త్రీ 5 లేదా 10 మంది పురుషులను పెళ్లి చేసుకునేందుకు ఆ సంస్కృతి అనుమతిస్తుందని పేర్కొన్నారు.

మన సంస్కృతిలో ఒక పురుషుడు ఒక స్త్రీని వివాహం చేసుకుంటాడు కానీ.. ఉత్తర భారతదేశంలో ఒక స్త్రీ అనేకమంది పురుషుల్ని వివాహం చేసుకోవచ్చని తెలిపారు. అలాగే ఐదుగురు పురుషులు ఒక స్త్రీని వివాహం చేసుకోవచ్చని తెలిపారు. ఈ నేపథ్యంలోనే... తమిళాన్ని అవమానించే వారి నాలుకను నరికేస్తామని మంత్రి దురై మురుగన్ హెచ్చరించారు.

ఇదే సమయంలో గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. అన్ని రాష్ట్రాల్లోనూ జనాభా నియంత్రణ జరగాలని సూచించారని.. దీంతో దక్షిణ భారతదేశంలో వాటిని అమలు చేశామని.. అందువల్ల ఇక్కడ జనాభా తగ్గిందని తెలిపారు దురై మురుగన్. కానీ.. ఉత్తర భారతదేశంలో మాత్రం జనాభా తగ్గలేదని.. వారు 17, 18, 19 మందికి పైగా పిల్లలకు జన్మనిచ్చారని, వారికి వేరే పని లేదని అన్నారు!

దీంతో... ఈ వ్యాఖ్యలు ఒక్కసారిగా పెను దుమారం రేపాయి. ఈ సందర్భంగా... మహాభారతాన్ని మంత్రి పరోక్షంగా ప్రస్థావించారనే చర్చ తెరపైకి వచ్చిందని అంటున్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ... సీఎం స్టాలిన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది!