Begin typing your search above and press return to search.

ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు ఎక్కడంటే?

దసరా సెలవులు ముగిసిన తర్వాత స్కూళ్లకు సెలవులు చాలా అరుదుగా ఇస్తుంటారు.

By:  Tupaki Desk   |   14 Oct 2024 5:16 AM GMT
ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు ఎక్కడంటే?
X

దసరా సెలవులు ముగిసిన తర్వాత స్కూళ్లకు సెలవులు చాలా అరుదుగా ఇస్తుంటారు. ఇప్పుడు ఏపీలో అలాంటి పరిస్థితి నెలకొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఏపీలోని పలు జిల్లాలపై తన ప్రభావాన్ని చూపుతోంది. వారం క్రితమే..ఈ అల్పపీడనంపై అంచనాలు వ్యక్తం కావటం.. రానున్న రోజుల్లో తుపానుగా మారుతుందని వాతావరణ శాఖకు చెందిన నిపుణులుఇప్పటికే చెప్పటం తెలిసిందే. వారి అంచనాలకు తగ్గట్లే.. ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు మొదలయ్యాయి.

ఉమ్మడి చిత్తూరు.. నెల్లూరు.. ప్రకాశం.. గుంటూరు.. క్రిష్ణా.. విశాఖ జిల్లాల్లో ఆదివారం తెల్లవారుజాము నుంచి వర్షాలు మొదలయ్యాయి. ఇందులో కొన్నిచోట్ల భారీ వర్షాలుగా మారాయి. పలు చోట్ల విదయుత్ సరఫరాకుఅంతరాయం ఏర్పడింది. తాజాగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బాపట్ల.. ప్రకాశం.. నెల్లూరు జిల్లాల్లోని స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. తాజాగా కురుస్తున్న వర్షాలతో తిరుమలలోని భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

నాన్ స్టాప్ గా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో నెల్లూరు జిల్లాలోని కలెక్టరేట్ లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. జిల్లాలోని డివిజన్.. మండల కేంద్రాల్లోనూ కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. రెవెన్యూ.. నీటిపారుదల అధికారులు పెన్నా నది గట్లు పరిశీలించాలన్న ఆదేశాలు జారీ చేశారు. సముద్ర తీర ప్రాంత ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రకాశం జిల్లాతో పాటు బాపట్ల జిల్లాల్లోనూ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు తగిన ఏర్పాట్లు చేయటంతో పాటు.. విపత్తు నిరోధక ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ భారీ వర్షాల తీవ్రత ఎంత వరకు ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.