Begin typing your search above and press return to search.

'జనసేన కార్యకర్తకు ఉన్న విలువ వైసీపీ ఎమ్మెల్సీకి లేదా'?

అవును... తనపై నమోదైన కేసుకు సంబంధించి మాధురితో కలిసి దువ్వాడ శ్రీనివాస్ టెక్కిలి పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   21 Dec 2024 1:30 AM GMT
జనసేన కార్యకర్తకు ఉన్న విలువ వైసీపీ ఎమ్మెల్సీకి లేదా?
X

ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో అరెస్టులు, నేతల వార్నింగులు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... గత ప్రభుత్వ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సహా కార్యకర్తల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేశారంటూ దువ్వాడ జగన్నాథంపై ఫిర్యాదు అందిన సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా... టెక్కలి జనసేన నియోజకవర్గ ఇన్ ఛార్జ్ కణితి కిరణ్ నవంబర్ 18న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. ఆ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ నెల 13న దువాడకు 41ఏ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే శుక్రవారం పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు దువ్వాడ శ్రీనివాస్

అవును... తనపై నమోదైన కేసుకు సంబంధించి మాధురితో కలిసి దువ్వాడ శ్రీనివాస్ టెక్కిలి పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై ఫైర్ అవుతూ.. ప్రధానంగా స్థానిక ఎమ్మెల్యే, మంత్రి అచ్చెన్నాయుడికి హెచ్చరికలు జారీ చేశారు.

ఇందులో భాగంగా... మంత్రి అచ్చెన్నాయుడు తప్పుడు కేసులు పెట్టి తనను హింసించాలని అనుకుంటే.. ఫ్యూచర్ లో రెట్టింపు ఫలితాలు అనుభవించాల్సి వస్తుందని.. కూటమి ప్రభుత్వంలో జనసేన, టీడీపీ నాయకులు పెట్టే కేసులు దువ్వాడ శ్రీనివాస్ ను అదిరించలేవు, బెదిరించలేవు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇదే సమయంలో... తాము మరళా అధికారంలోకి వస్తామని.. అప్పుడు కూడా సేమ్ ట్రీట్ మెంట్ ఇస్తామని స్పష్టంగా చెప్తున్నట్లు స్పష్టం చేసిన దువ్వాడ... ఈ ప్రభుత్వంలో పోలీసుల వద్ద జనసేన పార్టీ కార్యకర్తకు ఉన్న విలువ ప్రజాప్రతినిధికి లేదని.. జనసేన కార్యకర్త కేసు పెడితే ఎమ్మెల్సీని స్టేషన్ కు తీసుకొచ్చారని అన్నారు.

అయితే.. ఒక ఎమ్మెల్సీగా తాను ఫిర్యాదు చేస్తే పోలీసులు కనీసం స్పందించలేదని మండిపడ్డారు. ఏది ఏమైనా... ప్రజా ప్రతినిధిగా తన పోరాటం ఆగదని.. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని దువ్వాడ స్పష్టం చేశారు.

ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేకపోయారని.. వాటి గురించి ప్రశ్నించిన వైసీపీ కార్యకర్తలను సోషల్ మీడియా పోస్టులకు సంబంధించిన కేసుల పేరిట వేధిస్తున్నారని దువ్వాడ విమర్శించారు. ఈ సందర్భంగా.. అధికారం తాత్కాలికం అని.. తప్పుడు కేసులను ప్రజలు గమనిస్తున్నారని.. తర్వాత రెట్టింపు రియాక్షన్ ఉంటుందని హెచ్చరించారు.