లీక్డ్ ఆడియో... దివ్వెల మాధురి ఆత్మహత్యాయత్నం దువ్వాడ శ్రీను స్కిప్ట్?
కొన్ని రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన భార్య దువ్వాడ వాణి, కుమార్తె ల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 1 Sep 2024 4:48 AM GMTకొన్ని రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన భార్య దువ్వాడ వాణి, కుమార్తె ల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. దాదాపు వారం రోజుల పాటు మీడియాలో ఈ "దువ్వాడ కుటుంబ కథా చిత్రమ్" తీవ్ర సంచలన అంశంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో దివ్వెల మాధురి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన అంశంలో బిగ్ ట్విస్ట్ నెలకొంది.
అవును... ఇటీవల కాలంలో ఏపీలో అత్యంత తీవ్ర చర్చనీయాంశం అయిన అంశాల్లో దువ్వాడ కుటుంబ కథా చిత్రమ్ ఒకటనే సంగతి తెలిసిందే. తనను, తన పిల్లలను వదిలిపెట్టి ఆయన మరో మహిళతో ఉంటున్నారన్నట్లుగా దువ్వాడ శ్రీను భార్య వాణీ, కుమార్తె సంచలన ఆరోపణలు చేశారు. ఈ సమయంలో విడాకులే తన విచిత్ర కథకి ముగింపని చెప్పుకొచ్చారు.
ఈ నేపథ్యంలో... ఈ వ్యవహారం మొత్తంలో సెంటర్ పాయింట్ గా చెప్పబడిన దివ్వెల మాధురి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు! తన కారుతో హైవేపై మరో వాహనాన్ని ఢీకొట్టడం, ఆమెను ఆస్పత్రికి తరలించడం తెలిసిందే. అనంతరం ఆమె డిశ్చార్జ్ అయ్యారు. ఆ సమయంలో ఆమె, ఆమె భర్య మహేష్ యూఎస్ నుంచి ఓ టీవీ ఛానల్ తో మాట్లాడారు.
ఈ సమయంలో.. దివ్వెల మాధురి కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆమె ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించారని తెలిపారు. అయితే... అది ప్రమాదం మాత్రమే అని.. దాన్ని ఆత్మహత్యాయత్నంగా మార్చేలా దువ్వాడ శ్రీను ప్లాన్ చేశారనే అంశం ఇప్పుడు తెరపైకి వచ్చింది!
తను ఆత్మహత్యాయత్నంకు కారణం దువ్వాడ వాణీ అని చెప్పడం, ఆమె చేస్తున్న విమర్శలు, ఆరోపణల నేపథ్యంలోనే తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు చెప్పడం దువ్వాడ శ్రీను స్క్రిప్ అని, వాణిపై మాధురి చేసిన ఆరోపణలు దువ్వాడ శ్రీను డైరెక్షన్ అనే చర్చ తెరపైకి వచ్చింది! అందుకు కారణం అయ్యింది.. తాజాగా నెట్టింట హల్ చల్ చేస్తున్న ఓ లీక్డ్ ఆడియో!
ఈ ఆడియోలో దువ్వాడ శ్రీనివాస్.. మాధురి కారు ప్రమాధం గురించి తెలిసిన తర్వాత ఆమెతో ఫోన్ మాట్లాడారు. తొలుత కాస్త ఆందోళన వ్యక్తం చేసినట్లు వినిపించింది. అప్పటికి ఆమె 108 అంబులెన్స్ లో ఉన్నట్లు తెలిపారు. అనంతరం... ఈ ఆత్మహత్యాయత్నానికి దువ్వాడ వాణీనే కారణం.. ఆమె వేధింపులు భరించలేకే ఆత్మహత్యకు యత్నించినట్లు చెప్పమని శ్రీను.. మాధురికి చెప్పరు!!
ఇలా మనస్థాపంతో మాధురి రోడ్డు ప్రమాదం చేసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో... దీనికి కారణం వాణి అని మీడియా ముందు చెప్పమని దువ్వాడ శ్రీను ఆమెను గైడ్ చేయడం లీకైన ఆ ఫోన్ సంభాషణలో వినిపిస్తుంది. తన ఆత్మహత్యా యత్నానికి దువ్వాడ వాణీనే కారణమని చెప్పాలంటూ శ్రీను.. ఆమెకు సలహా ఇచ్చారు.. దీన్ని అలాగే పాటించిన మాధురి ఇదే విషయాన్ని నాడు మీడియాతో చెప్పారు.
ఇప్పుడు దీనికి సంబంధించిన ఆడియో కాల్ వైరల్ గా మారుతోంది! మరి ఈ ఆడియోలో వినిపిస్తున్న సంభాషణ నిజమేనా.. లేక, ఇది ‘ఏఐ’ ఆడియో అని శ్రీను ఏమైనా ఆరోపిస్తారా.. అసలు దీనిపై ఏమైనా స్పందిస్తారా అనేది వేచి చూడాలి!