Begin typing your search above and press return to search.

"స్మైల్ బాగుంది!"... దువ్వాడ - మాధురీ వాట్సప్ చాటింగ్ వెలుగులోకి!

ఇదే సమయంలో.. "మోస్ట్లీ మీ స్మైల్ నాకు చాలా ఇష్టం.. మీరు నవ్వితే బాగుంటావు.. చాలా చాలా హ్యాండ్ సమ్ ..!" అని ఆమె చాట్ కంటిన్యూ చేసినట్లు వెల్లడించారు.

By:  Tupaki Desk   |   11 Aug 2024 4:46 AM GMT
స్మైల్  బాగుంది!... దువ్వాడ - మాధురీ వాట్సప్  చాటింగ్  వెలుగులోకి!
X

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం రోజు రోజుకీ తీవ్రరూపం దాల్చుతున్నట్లు కనిపిస్తుంది. ఈ సందర్భంగా దువ్వాడ శ్రీనివాస్ ని మాధురి అనే మహిళ ట్రాప్ చేసిందంటూ ఆరోపిస్తున్న ఆయన కుటుంబ సభ్యులు.. ఆ ఆరోపణలను బలపరిచే సాక్ష్యాలను బయటపెడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సమయంలో తాజాగా ఆయనతో మాధురి వాట్సప్ చాట్ ను వెలుగులోకి తెచ్చారు!

అవును... దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారంలో సెంటర్ పాయింట్ గా నిలిచినట్లు చెబుతున్న మాధురికి సంబంధించిన పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నట్లున్నాయి. ఈ మేరకు తాజాగా దువ్వాడ శ్రీనుతో ఆమె చేసిన వాట్సప్ చాటింగ్ మెసేజ్ లను ఆయన కుమార్తె బయటపెట్టారు. ఈ సందర్భంగా... "గడప గడపకీ వచ్చేది మీ కోసమే...!" అంటూ మాధురి తన తండ్రికి మెసేజ్ పెట్టినట్లు ఆయన కుమార్తె చూపించారు.

ఇదే సమయంలో.. "మోస్ట్లీ మీ స్మైల్ నాకు చాలా ఇష్టం.. మీరు నవ్వితే బాగుంటావు.. చాలా చాలా హ్యాండ్ సమ్ ..!" అని ఆమె చాట్ కంటిన్యూ చేసినట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన స్ర్కీన్ షాట్లు వారు మీడియాకు చూపించారు. ఈ సందర్భంగా.. "ఏమీ లేనప్పుడు ఇటువంటి మెసేజ్ లు ఎవరైనా పెడతారా.. ఫ్రెండ్ అని చెబుతుంది కదా.. ఫ్రెండ్ అయితే ఇలాంటి మెసేజ్ లు పెడతారా" అని శ్రీను కుమార్తె ప్రశ్నిస్తున్నారు.

ఇదే సమయంలో... శ్రీనివాస్ బర్త్ డేకి చాలా మంది డ్యాన్స్ చేశారని, అలానే ఆమె కూడా ఆరోజు డ్యాన్స్ చేసిందని, ఈ సందర్భంగా ఆరోజు డ్యాన్స్ చేసినవారందరికీ సన్మానాలు చేసినట్లు చెబుతున్న ఆయన కుటుంబ సభ్యులు... ఆ క్రమంల్లోనే నాడు మాధురికి శాలువా కప్పామని.. దానికి సంబంధించిన ఫోటోలు చూపిస్తూ.. మేమే ఆమెను రాజకీయాల్లోకి తీసుకొచ్చినట్లు చెబుతుందని చెప్పుకొచ్చారు.