Begin typing your search above and press return to search.

తెరపైకి దువ్వాడ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్... తగులుకుంటున్న పవన్ ఫ్యాన్స్!

అవును... కొంతమంది నేతలు అధికారంలో ఉన్నప్పుడు చెప్పే నీతి కబుర్లు మామూలుగా ఉండవు.

By:  Tupaki Desk   |   9 Aug 2024 7:32 AM GMT
తెరపైకి దువ్వాడ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్... తగులుకుంటున్న పవన్  ఫ్యాన్స్!
X

ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి.. అంటుంటారు. కొంతమంది చెప్పే కబుర్లకూ, చేసే పనులకూ ఏమాత్రం పొంతన లేకపోతే ఇలాంటి స్టేట్ మెంట్స్ ఇస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా వైసీపీకి చెందిన ఓ ఎమ్మెల్సీ సుద్దపూస వ్యవహారం తెరపైకి వచ్చింది! గతంలో పెళ్లిల్ల పేరు చెప్పి పవన్ కల్యాణ్ పై ఆయన చేసిన విమర్శలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి.

అవును... కొంతమంది నేతలు అధికారంలో ఉన్నప్పుడు చెప్పే నీతి కబుర్లు మామూలుగా ఉండవు. సాంప్రదాయనీ.. సుబ్బినీ.. సుద్దపూసని అన్న స్థాయిలో ఉంటుంటాయి! పైగా వీరు చెప్పే గురివింద గింజ కబుర్లు ఒక్కో సారి పీక్సి చేరుతుంటాయి. అయితే సరైన ముహూర్తం చూసి కాలం గేలమేస్తే... ఆ ఎరకు చిక్కి పరిస్థితి విలవిల్లాడిపోతుంటుంది. ఓ వైసీపీ ఎమ్మెల్సీ పరిస్థితి ఇదే అంటున్నారు నెటిజన్లు!

వివరాళ్లోకి వెళ్తే... పవన్ కల్యాణ్ మూడు పెళ్లిల్ల వ్యవహారంపై తీవ్ర విమర్శలు చేసిన వారిలో దువ్వాడ శ్రీనివాస్ ఒకరు. నాడు ఆయన ఈ వ్యవహారంపై మాట్లాడుతూ... అసలు ఒక్కడు ముగ్గురిని చేసుకోవడం ఏమిటి.. అది పద్దతి కాదు, తెలుగువాడు ఏకపత్నీ వ్రతుడిగా ఉండాలి.. ఒకే స్త్రీతో సంసారం మన సాంప్రదాయం వంటి డైలాగులు ఆయన అప్పట్లో కాస్త బలంగానే పేల్చారు.

కట్ చేస్తే ఇప్పుడు సదరు దువ్వాడ శ్రీనివాస్ రెండో పెళ్లి వ్యవహారం ఇప్పుడు రచ్చ రచ్చగా మారిన పరిస్థితి. దువ్వాడ కొంతకాలంగా మొదటి భార్యను విడిచిపెట్టి రెండో భార్యతోనే ఉంటున్నాడట. ఈ నేపథ్యంలో తమకు అన్యాయం చేస్తున్నాడంటూ ఆయన (మొదటి) భార్య, కుమార్తె రోడ్డుపైకి వచ్చి నిరసన తెలుపుతున్న పరిస్థితి.

ఈ మేరకు గురువారం దువ్వాడను కలిసేందుకు శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని అక్కవరం సమీపంలో నేషనల్ హైవేని ఆనుకుని ఉన్న ఆయన ఇంటికి వచ్చిన కుమార్తెలు ఎంత సేపు ఎదురుచూసినా వారి నిరీక్షణ ఫలించలేదు. మద్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ ఇంటి ముందు వేచి ఉన్నా భవనం గేట్లు తెరుచుకోని పరిస్థితి. దీంతో.. వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా స్పందించిన దువ్వాడ శ్రీనివాస్ కుమార్తె... ఇంటి ముందు ఉండి హారన్ కొట్టినా, గేటు గడియలు కొట్టినా లోపలున్నవారు స్పందించలేదని.. ఇంటిలో లైట్స్ అన్నీ ఆపేశారని.. వారి కార్లు లోపలే ఉన్నాయని తెలిపారు. తన భర్త తండ్రి చనిపోయినా కనీసం పరామర్శకు రాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఫోన్ చేసినా, మెసేజ్ లు చేసినా స్పందించడం లేదని ఆరోపించారు.

తమ తండ్రిని కలవడానికి చాలా కాలంగా ప్రయత్నిస్తున్నా ఆయన స్పందించడం లేదని.. తమ తండ్రి తమతో కలవకపోవడానికి ఆ ఇంట్లో ఉంటున్న మహిళే కారణమని ఆమె ఆరోపించారు. దీంతో... రెండో భార్య ఉన్న వ్యక్తి ఏకపత్నీ వ్రతం గురించి నీతులు చెబుతూ, పవన్ ని అన్నేసిమాటలు అన్నాడా అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.