దువ్వాడ ఫ్యామిలీలో సెటిల్ మెంట్ ఎపిసోడ్ షురూ!
ఈ సందర్భంగా దువ్వాడ శ్రీనివాస్ సతీమణి.. ఆయనకు ఐదు డిమాండ్లను భర్త ముందు పెట్టినట్లుగా చెబుతున్నారు.
By: Tupaki Desk | 13 Aug 2024 4:23 AM GMTవారం రోజులుగా సాగుతున్న వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ ఫ్యామిలీ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి సంచలనంగా మారిందన్నది చూస్తున్నదే. మీడియా.. సోషల్ మీడియాలో ఈ ఇష్యూకు ఇచ్చినంత ప్రాధాన్యతతో పాటు.. ప్రజల్లోనూ ఈ ఫ్యామిలీ వ్యవహారంపై పెద్ద ఎత్తున ఆసక్తి వ్యక్తమైంది. దీనికి తోడు గతంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్లపై దారుణ వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ దువ్వాడ.. గతంలో తాను చెప్పిన నీతులకు భిన్నంగా ఆయన భార్యే వీధుల్లోకి రావటం.. తన భర్తకు మరో మహిళతో (దివ్వెల మాధురీ) సన్నిహిత సంబంధం ఉందని వ్యాఖ్యానించటం తెలిసిందే.
దీనిపై మాధురి మీడియా ముందుకు రావటం.. తనవాదనలు వినిపించటం.. ఆ తర్వాత సూసైడ్ అటెంప్టు చేయటం లాంటివి ఒక ఎత్తు అయితే.. దువ్వాడ భార్య వాణి సైతం తనకుమార్తెను తీసుకొని ఇంటికి రాగా.. ఆమెను లోపలకు రానివ్వకపోవటం.. గేటు బయట, రోడ్డు మీదనే ఉండిపోవటం లాంటి పరిణామాలు భారీగా చోటు చేసుకోవటం తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ మూడు పెళ్లిళ్లపై తాను గతంలో చేసిన వ్యాఖ్యలకు భిన్నంగా రియాక్టు అవుతున్నారు.
జనసేనాని మూడు పెళ్లిళ్లపై గతంలో దువ్వాడ సీరియస్ వ్యాఖ్యలు చేయగా.. ఇప్పుడు అందుకు భిన్నమైన వాదనను వినిపించిన వైనం ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇక.. ఎమ్మెల్సీ దువ్వాడ ఫ్యామిలీ మ్యాటర్ కు సంబంధించిన వివాదంలో సోమవారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. దువ్వాడకు ఇద్దరు ఎపిసోడ్ లో ఒకటి తర్వాత ఒకటి చొప్పున నాటకీయ పరిణామాలకు కొదవ లేకుండా సాగింది.
టెక్కలి నియోజకవర్గంలో మొదలైన ఈ రచ్చ రెండు తెలుగు రాష్ట్రాలకు వ్యాపించటం తెలిసిందే. అంతకంతకూ ముదురుతున్న ఈ రచ్చకు పుల్ స్టాప్ పెట్టాలన్న ఉద్దేశంతో దువ్వాడ శ్రీనివాస్.. ఆయన సతీమణి వాణికి చెందిన కుటుంబ సభ్యులు.. బంధువులు ఎంట్రీ ఇచ్చారు. వారిద్దరికి ఏం కావాలి? ఈ ఇష్యూను ఎలా సెటిల్ చేయాలన్న దానిపై సోమవారం కీలక చర్చలు జరిగాయి.
ఈ సందర్భంగా దువ్వాడ శ్రీనివాస్ సతీమణి.. ఆయనకు ఐదు డిమాండ్లను భర్త ముందు పెట్టినట్లుగా చెబుతున్నారు. అయితే.. ఆ ఐదు డిమాండ్లు ఏమిటి? వాటి సారాంశం ఏమిటన్న దానిపై వివరాలు బయటకు రానివ్వలేదు. రెండు కుటుంబాల వారు ఆ డిమాండ్లను బయటకు వెల్లడించట్లేదు.ఈ ఐదు డిమాండ్ల మీద ఎమ్మెల్సీ దువ్వాడ సానుకూలంగా రియాక్టు అయినట్లు తెలుస్తోంది.
అయితే.. ఆస్తుల విషయంపై మాత్రం లెక్కలు తేల్లేదని.. పంపకాల విషయంలో క్లారిటీ వచ్చేస్తే దువ్వాడ ఫ్యామిలీ మ్యాటర్ క్లోజ్ అయినట్లేనని చెబుతున్నారు. వారం రోజులుగా సాగుతున్న రచ్చకు సోమవారం జరిగిన నాలుగు గంటల చర్చతో ఇరు కుటుంబాల మధ్యనున్న విభేదాలు ఒక కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తోంది.ఇరు వర్గాల కుటుంబాలు.. బంధువుల అంచనా ప్రకారం ఈ రోజు (మంగళవారం) ఇష్యూ సెటిల్ అవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.