Begin typing your search above and press return to search.

సెల్ ఫోన్ మాట్లాడుతూ ఓటు వేసిన ఎమ్మెల్యే అభ్యర్థి.. వీడియో!!

అవును... శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్.. సోమవారం సాయంత్రం ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ బూత్ కు వచ్చారు.

By:  Tupaki Desk   |   14 May 2024 5:13 AM GMT
సెల్  ఫోన్  మాట్లాడుతూ ఓటు వేసిన ఎమ్మెల్యే అభ్యర్థి.. వీడియో!!
X

ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన సంగతి తెలిసిందే. ఏపీలో ప్రజలు చైతన్యంతో భారీ ఎత్తున పోలింగ్ లో పాల్గొనడం ఈ సందర్భంగా శుభపరిణామం అని అంటున్నారు. ఇందులో భాగంగా ఎన్నికల కమిషన్‌ అంచనాల ప్రకారం అర్ధరాత్రి 12 గంటల సమయానికి సుమారు 78.36 శాతం పోలింగ్‌ నమోదైంది.

ఈ సందర్భంగా కొన్ని హింసాత్మక ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో నిబంధనలకు విరుద్ధంగా పలువురు నేతలు అనుసరించిన తీరు వివాదాస్పదమవుతుంది. ప్రధానంగా... తెనాలిలో ఎమ్మెల్యే వర్సెస్ ఓటరు చెంపదెబ్బల ఎపీసోడ్ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో సెల్ ఫోన్ మాట్లాడుతూ బూత్ లోకి వెళ్లడమే కాకుండా.. ఓటు కూడా వేసిన ఒక అభ్యర్థి తీరు వివాదాస్పదమవుతుంది!

పోలింగ్ బూత్ లోకి ప్రవేశించేటప్పుడు ఎవరూ మొబైల్స్ తీసుకుని రాకూడదని ఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలియకుండా ఎవరైనా వెంట తీసుకుని వెళ్తే... వారిని మొబైల్స్ ఎన్నికల అధికారులు కలెక్ట్ చేసుకుని, టోకెన్ ఇస్తున్నారు. ఓటు వేసిన అనంతరం తిరిగి వారి సెల్ ఫోన్లు వారికి ఇస్తున్నారు. అయితే ఆ నిబంధనలు సామాన్యులకే తప్ప.. తనకు కాదని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఒకరు భావించినట్లుగా ప్రవర్తించిన విధానం వైరల్ గా మారింది.

అవును... శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్.. సోమవారం సాయంత్రం ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ బూత్ కు వచ్చారు. వాస్తవానికి సెల్ ఫోన్ ఉపయోగించటంపై నిషేధం ఉన్నప్పటికి.. అవేమీ లెక్కచేయకుండా అందరూ చూస్తుండగానే ఆయన ఫోన్ వాడారు.

ఇందులో భాగంగా... సెల్ ఫోన్ లో మాట్లాడుతూనే తన ఓటు హక్కును వినియోగించటం గమనార్హం. దీంతో ఈ విషయం తీవ్ర వివాదస్పదంగా మారింది. మరోపక్క అక్కడున్న ఎన్నికల సిబ్బంది దువ్వాడ శ్రీనివాస్ ను నిలువరించకుండా చూస్తూ ఉండిపోవడంపైనా విమర్శలు వస్తున్నాయి. దీంతో దర్జాగా ఫోన్ లో మాట్లాడుతూనే దువ్వాడ శ్రీనివాస్ తన ఓట్లను వినియోగించుకున్నారు. ఈ వ్యవహారం చూసిన ఓటర్లు.. ఈసీ నిబంధనలు కేవలం సామాన్యులకేనా అంటూ కామెంట్లు చేశారని తెలుస్తుంది!