కిలోమీటరు రోడ్డు నిర్మాణానికి.. రూ.250.77 కోట్లు! కాగ్ ఏమందంటే!
ఉత్తరాదిలో నిర్మిస్తున్న ద్వారకా ఎక్స్‌ప్రెస్ వేలో మాత్రం ఏదో మతలబు జరుగుతోంది
By: Tupaki Desk | 14 Aug 2023 6:59 AM GMTకిలో మీటరు రోడ్డు నిర్మాణానికి మహా అయితే ఎంత అవుతుంది? ఓ 20 కోట్లు ఖర్చవుతుంది. పోనీ.. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం.. కిలో మీటరుకు రూ.18 కోట్ల 20 లక్షలు ఖర్చవుతుంది. కానీ, ఉత్తరాదిలో నిర్మిస్తున్న ద్వారకా ఎక్స్‌ప్రెస్ వేలో మాత్రం ఏదో మతలబు జరుగుతోంది. ఎందుకంటే.. ఇక్కడ ఏకంగా కిలో మీటరు రహదారి నిర్మాణానికి రూ.250.77 కోట్లు కోట్ చేసినట్టు తాజాగా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా(కాగ్) తన నివేదికలో పేర్కొంది.
ద్వారకా ఎక్స్‌ప్రెస్ వే అనేది..దేశ రాజధాని ఢిల్లీ -గుర్గావ్‌ల మధ్య జాతీయ రహదారి-48పై రద్దీని తగ్గించ డానికి ఉద్దేశించిన ప్రాజెక్టు.ఇది మొత్తం 29 కిలో మీటర్ల దూరం ఉంటుంది. 2017-18 నుంచి 2020-21 వర కు నిర్వహించిన 'భారతమాల పరియోజన' (BPP-I) తొలి దశలో దీనిని చేపట్టారు. ఈ ప్రాజెక్టును కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంజూరు చేసింది. బడ్జెట్ విషయానికి వస్తే.. కిలో మీటరు రహదారి నిర్మాణానికి కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ రూ.18.20 కోట్లు మాత్రమే ఆమోదించింది.
అయితే.. తాజాగా ఈ ప్రాజెక్టు లెక్కలపై దృష్టి పెట్టిన కాగ్‌కు సంచలన విషయాలు తెలిసాయి. నిర్మాణ వ్యయం కిలో మీటరుకు రూ.250.77 కోట్లుగా ఖర్చు పెడుతున్నట్టు కాగ్ వెల్లడించింది. దీనిని చాలా ఎక్కువగా పేర్కొన్న కాగ్.. ఇంత వ్యయంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఆడిట్ నివేదికలో 14-లేన్ రోడ్ ప్రాజెక్ట్ - ఎనిమిది ఎలివేటెడ్ లేన్‌లపై అనేక పరిశీలనలు చేసింది.
ద్వారకా ఎక్స్‌ప్రెస్ వేను మొదట హర్యానా ప్రభుత్వం తన గుర్గావ్-మనేసర్ అర్బన్ కన్‌స్ట్రక్షన్ ప్లాన్-2031 కింద ప్లాన్ చేసిందని కాగ్ నివేదిక పేర్కొంది. దాని కోసం, హర్యానా 7-మీ-వెడల్పు మధ్యస్థం మరియు ట్రంక్ సేవల కోసం ఒక ప్రత్యేకమైన యుటిలిటీ కారిడార్‌తో 25 మీటర్ల ప్రధాన క్యారేజ్ మార్గాన్ని నిర్మించడానికి 150 మీటర్ల (రహదారి వెడల్పు) అనుమతి పొందినట్టు పేర్కొంది.