Begin typing your search above and press return to search.

వాతావరణ మార్పులపై జస్టిస్ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు

ప్రకృతితో చెలగాట ఎప్పటికి అయినా ప్రమాదమే. చిత్రమేంటి అంటే మనిషి కూడా ప్రకృతిలో ఓ భాగమే.

By:  Tupaki Desk   |   20 Oct 2024 2:11 PM GMT
వాతావరణ మార్పులపై జస్టిస్ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు
X

ప్రకృతితో చెలగాట ఎప్పటికి అయినా ప్రమాదమే. చిత్రమేంటి అంటే మనిషి కూడా ప్రకృతిలో ఓ భాగమే. ప్రకృతిని తక్కువ చేసి చూడడం, తన మేధో సంపత్తితో ప్రకృతిని ఇబ్బంది పెట్టడం ఇటీవల కాలంలో జరుగుతోంది.

ప్రకృతిలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దాని వల్ల అకాల వర్షాలు కురుస్తున్నాయి. అలాగే విపరీతమైన ఎండలు, వణికించే చలి ఇలా అన్ని కాలాలూ కూడా మనిషి మీద పగబట్టినట్లుగా తీవ్రంగానే ఉంటున్నాయి.

ఈ నేపథ్యంలో దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ చేసిన కీలక వ్యాఖ్యలు ఇపుడు మేధావులతో పాటు సగటు జీవులను సైతం ఆలోచింపజేస్తున్నాయి. జస్టిస్ చంద్రచూడ్ గోవా గవర్నర్ శ్రీధరన్ పిళ్ళే రచించిన ట్రెడిషనల్ ట్రీస్ ఆఫ్ ఇండియా అన్న పుస్తకాన్ని తాజాగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ గురించి చక్కని మాటలే చెప్పారు

ప్రకృతిని రక్షించడమే పౌరుల ప్రాథమిక బాధ్యత అని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. ఈ విషయంలో ప్రజల భాగస్వామ్యం ఎక్కువగా ఉండాలని అన్నారు. ప్రకృతి వైపరిత్యాల వల్ల ఎక్కువగా నష్టపోతున్నది మస్త్యకారులు, రైతులు, సమాజంలోని పేదలు బడుగులు బీదా బిక్కీలు అని చంద్రచూడ్ ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రకృతి విపత్తుల వల్ల సంపన్న వర్గాలు మాత్రమే నష్టపోతున్నాయని అనుకుంటే పొరపాటు అని ఆయన అన్నారు. వాతావరణంలో వస్తున్న మార్పులతో సమాజంలోని అన్ని వర్గాలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయని దారుణంగా నష్టపోతున్నాయని ఆయన విశ్లేషించారు. అక్టోబర్ నుంచి డిసేంబర్ నెలలల మధ్యలో వర్షాలు ప్రస్తుతం కురుస్తున్నాయని ఆయన వాతావరణ మార్పులకు ఉదాహరణగా చెప్పారు.

ఇదిలా ఉంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 48ఏ రాష్ట్ర పర్యావరణాన్ని పరిరక్షిస్తుందని ఆయన అన్నారు. ఇక అడవులను కాపాడుకోవాలని అలాగే అడవులలో ఉన్న జంతుజాలాన్ని ఇతర జీవరాశులను రక్షించాలని ఆర్టికల్ 48ఏ స్పష్టం చేసిందని అన్నారు. అదే విధంగా ఆర్టికల్ 51ఏ జీ అన్నది ప్రకృతిని రక్షించడం ప్రతి పౌరుడి ప్రాథమిక కర్తవ్యమని చెబుతోందని గుర్తు చేశారు.

ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవసరం వర్తమానంలో ఎంతో ఉందని అన్నారు. అంతే కాదు ప్రకృతి గురించి పొందిన జ్ఞానాన్ని ఈనాటి సమాజం గతంలో నుంచి నేర్చిన పాఠాలను భవిష్యత్‌ తరాలకు అందించాలన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి చేసిన ఈ వ్యాఖ్యలు అందరికీ ఆలోచింపజేస్తున్నాయి. ప్రకృతి విషయంలో ఎవరికి వారుగా తప్పులు చేసుకుంటూ పోతున్నారు.

అవి చివరికి మొత్తం సమాజానికే శాపంగా మారుతున్నాయని పర్యావరణవేత్తలు అంటున్నారు. ధర్మో రక్షతి రక్షిత హా అని మన సనాతన ధర్మం బోధిస్తోంది. అలాగే ప్రకృతిని రక్షించడం ద్వారానే యావత్తు మానవాళి రక్షిచబడుతుందని కూడా తెలుసుకఒవాలి. లేకపోతే వర్తమానం ప్రమాదకరం అవుతుంది, భవిష్యత్తు కడు భయంకరం అవుతుందని పర్వారణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో ఎంతో మంది పెద్దలు చెబుతున్నారు. వాటిని ప్రతీ ఒక్కరూ సలహా సూచనలుగా పాటిస్తే ఈ దేశం ఈ ప్రపంచం కూడా పర్యావరణ ముప్పు నుంచి బయటపడుతుంది అని అంటున్నారు.