రిక్టర్ స్కేల్ పై 7.1 తీవ్రతతో భూకంపం.. ఉత్తర భారత్ వణికింది!
నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో మంగళవారం ఉదయం 6:35 గంటల ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది.
By: Tupaki Desk | 7 Jan 2025 3:53 AM GMTనేపాల్-టిబెట్ సరిహద్దుల్లో మంగళవారం ఉదయం 6:35 గంటల ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.1గా నమోదైంది. నేపాల్-టిబెట్ సరిహద్దు లబుచేకు సుమారు 93 కిలోమీటర్ల దురంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు చెబుతున్నారు. ఈ ప్రభావం భారత్ లోనూ కనిపించిందని తెలుస్తోంది.
అవును... ఈ తెల్లవారుజామున నేపాల్ - టిబెట్ బోర్డర్ లో 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని ప్రభావం ఉత్తర భారతదేశంపైనా కనిపించిందని చెబుతున్నారు. ఇందులో భాగంగా... ఢిల్లీ, బీహార్, పశ్చిమ బెంగాల్ సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్లు చెబుతున్నారు. అయితే.. జరిగిన నష్టాలకు సంబంధించిన నివేదికలు అందాల్సి ఉంది.
నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్.సీ.ఎస్) ప్రకారం... ఉదయం 6:35 గంటలకు టిబెట్ లోజి బిజాంగ్ లో సుమారు 10 కి.మీ. లోతులో ఈ భూకంపం సంభవించింది!
భూకంప కేంద్రం అక్షాంశం 28.86 ఎన్, రేఖాంశం 87.51 ఈ వద్ద మూడు భూకంపాలు జిజాంగ్ ను కదిలించాయని అంటున్నారు. ఇందులో భాగంగా.. మొదటిది ఉదయం 5:41 గంటలకు రిక్టర్ స్కేలుపై 4.2 గా, ఆ తర్వాత రెండవది 6:35 గంటలకు 7.1 తీవ్రతతో సంభవించగా.. 7:02 గంటలకు మూడొవది 4.7 తీవ్రతతో నమోదైందని చెబుతున్నారు.