Begin typing your search above and press return to search.

అద్భుతమైన దృశ్యాలు.. భూమి ఈ విధంగా తిరుగుతుంది చూశారా?

భూమి తన చుట్టూ తాను గంటకు 1,666 కిలోమీటర్ల వేగంతో తిరిగితే.. సూర్యుడి చుట్టూ గంటకు 1,07,280 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   1 Feb 2025 8:05 AM GMT
అద్భుతమైన దృశ్యాలు.. భూమి ఈ విధంగా తిరుగుతుంది చూశారా?
X

భూమి తన చుట్టూ తాను తిరుగుతూ.. సూర్యుని చుట్టూ తిరుగుతుంది అనే విషయం దాదాపు అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో భూమి తన చుట్టూ తాను తిరగడానికి సుమారు 24 గంటల సమయం పడితే.. సూర్యుని చుట్టూ తిరిగిరావడానికి దాదాపు 365 రోజులు పడుతుంది. ఈ క్రమంలో... ఈ భూభ్రమణానికి సంబంధించిన అద్భుతమైన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అవును... భూమి తన చుట్టూ తాను గంటకు 1,666 కిలోమీటర్ల వేగంతో తిరిగితే.. సూర్యుడి చుట్టూ గంటకు 1,07,280 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ సమయంలో అంత వేగంతో తిరుగుతున్న వేళ.. ఈ భూభ్రమణానికి సంబంధించిన దృశ్యాలు తాజాగా సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. ఇప్పుడు అవి వైరల్ గా మారాయి.

వివరాళ్లోకి వెళ్తే... తాజాగా భారతీయ ఖగోళ శాస్త్రవేత్త డోర్జే అంగ్ చుక్.. లడ్డాఖ్ లో భూభ్రమణానికి సంబంధించిన దృశ్యాలను టైంలాప్స్ లో బంధించారు. హాన్లేలోని ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీలో ఇంజినీర్ - ఇన్ ఛార్జ్ గా పనిచేస్తున్న అంగ్ చుక్.. 24 గంటల పాటు టైంలాప్స్ ను ఉపయోగించి ఈ దృశ్యాలు చిత్రీకరించారు!

ఈ సమయంలో.. మొత్తం 24 గంటలకు సంబంధించిన వీడియో మొత్తాన్ని ఒక నిమిషం నిడివిగల వీడియోగా క్రోడీకరించారు. ఈ వీడియోలో భూమి ఎలా భ్రమిస్తుందనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. పగలు, రాత్రి, వెలుగు, చీకటి వీలైనంత స్పష్టంగా కనిపిస్తున్నాయి!

ఈ సందర్భంగా స్పందించిన భారతీయ ఖగోళ శాస్త్రవేత్త డోర్జే అంగ్ చుక్.. నక్షత్రాలు నిశ్చలంగా ఉంటే, భూమి పరిభ్రమిస్తూ ఉంటుందని.. ఈ సమయంలో వీడియోలో బంధించడానికి చాలా ఇబ్బందులు పడినట్లు తెలిపారు. ప్రధానంగా... భూభ్రమణం గురించి విద్యార్థులు సులువుగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడేలా వీడియో రూపొందించాలని తనకు ఓ అభ్యర్థన వచ్చిందని అన్నారు.

ఈ నేపథ్యంలోనే ఈ ప్రాజెక్ట్ చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో... లడ్డాఖ్ లోని విపరీతమైన శీతల పరిస్థితులు ఉండటంంవల్ల ఈ వీడియో చిత్రీకరణ సమయంలో పలుమార్లు బ్యాటరీ వైఫల్యాలు జరిగాయని.. టైమర్ పనిచేయకపోవడం వంటి ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపారు. అయినప్పటికీ ఎలాగైనా ఈ వీడియోను రూపొందించాలనే ఆలోచనతో ఈ పని పూర్తిచేసినట్లు వెల్లడించారు.