Begin typing your search above and press return to search.

ప్రకృతి ప్రకోపం.. ఆఫ్ఘన్ లో భుకంపం.. 2000 మంది మృతి!

ప్రకృతి ప్రకోపించిందనుకోవాలా.. లేక, మనిషి చేస్తున్న పాపాలకు ప్రతిఫలం అనుకోవాలో తెలియదు కానీ... తాజాగా ఆఫ్ఘనిస్తాలో అలాంటి సంఘటనే జరిగింది.

By:  Tupaki Desk   |   8 Oct 2023 8:08 AM GMT
ప్రకృతి ప్రకోపం.. ఆఫ్ఘన్ లో భుకంపం.. 2000 మంది మృతి!
X

ప్రకృతి ప్రకోపించిందనుకోవాలా.. లేక, మనిషి చేస్తున్న పాపాలకు ప్రతిఫలం అనుకోవాలో తెలియదు కానీ... తాజాగా ఆఫ్ఘనిస్తాలో అలాంటి సంఘటనే జరిగింది. అరగంటలో సంభవించిన 3 భూకంపాలు ఆఫ్ఘనిస్తాన్‌ ను అతలాకుతలం చేశాయి. ఈ వరుస భూకంపాలతో ఆఫ్ఘన్ వాసులు బెంబేలెత్తిపోయారు.

అవును... అఫ్గానిస్థాన్‌ పశ్చిమ ప్రాంతం ఒక్కసారిగా విలవిల్లాడిపోయింది. హటాత్తుగా సంభవించిన భూకంపాలు పెను విధ్వంసం సృష్టించింది. శనివారం సంభవించిన ప్రకృత్తి విపత్తు కారణంగా భారీ ప్రాణ నష్టం చోటుచేసుకుంది. ఈ విపత్తులో ఇప్పటి వరకూ సుమారు రెండు వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయి ఉంటారని అక్కడ ప్రభుత్వ ప్రతినిధులు చెబుతున్నారు.

ఈ భూకంపం కారణంగా వేలమంది ప్రాణాలు కోల్పోగా... వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఆ శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వాటికింద మరికొన్ని వందల మంది ఉంటారని అంచనా వేస్తున్నారు. దీంతో... మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సహాయక చర్యలు చేపడుతున్న అధికారులు తెలియజేస్తున్నారు.

రిక్టర్ స్కేలు పై వీటి తీవ్రత వరుసగా 5.6, 6.1, 6.3 గా ఉందని తెలుస్తుంది. హెరాత్‌ ప్రావిన్స్‌ కు వాయువ్యంగా 40 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం 12 గంటల 19 నిమిషాలకు 5.6 తీవ్రతతో మొదటిసారి భూ ప్రకంపనలు వచ్చినట్లు తెలిపింది.

ఆ తర్వాత మరో అరగంట వ్యవధిలోనే మరో 2 సార్లు భూకంపం సంభవించినట్లు పేర్కొంది. ఇలా సుమారు ఐదు సార్లు భూమి కంపించినట్లు వెల్లడించింది. ప్రధానంగా ఈ మూడుసార్లూ తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. సుమారు 4200 మందికిపైగా ప్రజలు ఈ భూకంపం తీవ్రతకు ప్రభావితమయ్యారని అంటున్నారు.

హిందూకుష్ ప్రాంతంలో ఉండే ఈ హెరాత్‌ ప్రావిన్సులో తరుచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. ఈ ప్రాంతంలో నేల అంతర్భాగాన్న యురేషియా టెక్టానిక్ ప్లేట్, ఇండియా టెక్లానిక్ ప్లేట్ల జంక్షన్ ఉంది. దీంతో... ఈ పలకలు తరుచుగా ఒకదానితో ఒకటి ఢీకొట్టడం మూలంగా భారీ భూకంపాలు సంభవిస్తుంటాయని చెబుతున్నారు.

ఇదే సమయంలో ఆఫ్ఘన్ లోని తీ భూకంపం ప్రభావం ఢిల్లీ సహా ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో కనిపించిందని తెలుస్తుంది. ఉత్తరాఖండ్‌ లోని తీర్థయాత్ర పట్టణమైన జోషిమత్‌ కు ఆగ్నేయంగా 206 కిలోమీటర్ల దూరంలో, ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లఖ్ నవూకు ఉత్తరాన 284 కిలోమీటర్ల దూరంలో పశ్చిమ నేపాల్‌ లోనూ భూకంపం కేంద్రం ఉంది!