అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ మరో స్టెప్... వారంతా 10 నుంచి రంగంలోకి!
ఈ జాబితాలో సుమారు 67 మంది ఐఏఎస్ అధికారులను సాధారణ పరిశీలకులుగా నియమించింది. ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణ ప్రక్రియను పర్యవేక్షించడం ఈ పరిశీలకుల బాధ్యత!
By: Tupaki Desk | 2 Nov 2023 3:03 PM GMTతెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ సమయంలో అన్ని రాజకీయ పార్టీలూ ప్రచారాలతో హోరెత్తించేస్తున్నాయి. అధికార, విపక్షాల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలతో హోరెత్తిపోతోంది వాతావరణం. మరోపక్క కాంగ్రెస్ ఇప్పటికీ ఆపరేషన్ ఆకర్ష నడిపిస్తుంది. ఇక బీఆరెస్స్ అధినేత కేసీఆర్ నియోజకవర్గాలన్నీ సుడిగాలి పర్యటన చేపడుతున్నారు. ఈ సమయంలో ఎన్నికల కమిషన్ మరో అడుగు ముందుకు వేసింది.
అవును... తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల సంఘం ఏర్పాటలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల పరిశీలకులను నియమించింది. దీనికోసం ఇతర రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పరిశీలకులుగా బాధ్యతలు అప్పగించింది. ఈ జాబితాలో సుమారు 67 మంది ఐఏఎస్ అధికారులను సాధారణ పరిశీలకులుగా నియమించింది. ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణ ప్రక్రియను పర్యవేక్షించడం ఈ పరిశీలకుల బాధ్యత!
ఇదే సమయంలో 39 మంది ఐపీఎస్ అధికారులను పోలీసు పరిశీలకులుగా నియమించింది ఎన్నికల కమిషన్. ఆయా నియోజకవర్గాల్లో శాంతిభద్రతల నిర్వహణ, సంబంధిత అంశాప పర్యవేక్షణ వీరి బాధ్యత. ఈ నేపథ్యంలో... సాధారణ పరిశీలకులు, ఎన్నికల పరిశీలకులు నవంబర్ 10వ తేదీ నుంచి రంగంలోకి దిగనున్నారు.
అయితే... ఇప్పటికే 60 మంది ఐ.ఆర్ఎ.స్, ఐ.ఆఆర్.ఏ.ఎస్ అధికారులను వ్యయ పరిశీలకులుగా ఈసీ నియమించిన సంగతి తెలిసిందే. నామినేషన్ల ప్రారంభంతో వీరు శుక్రవారం నుంచి విధులు చేపట్టనున్నారు.
ఆ సంగతి అలా ఉంటే... మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేసింది. ఇందులో భాగంగా ఆయా రాష్ట్రాలతోపాటు వాటి సరిహద్దు రాష్ట్రాలకు చెందిన సీఎస్ లు, డీజీపీ latO.. కేంద్ర ఎన్నికల కమిషన్ వర్చువల్ సమీక్ష నిర్వహించింది. ఈ మీటింగ్ లో తెలంగాణ నుంచి సీఎస్ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ పాల్గొన్నారు.
ఇందులో భాగంగా... ఓటింగ్ రోజు సరిహద్దుల్లో ప్రజల రాకపోకలకు అవకాశం లేకుండా పోలింగ్ తేదీకి ముందే రాష్ట్ర సరిహద్దులను మూసివేయాలని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ అదేశించారు. ఇదే సమయంలో నవంబర్ 28 నుంచి పోలింగ్ జరిగే 30 వరకు రాష్ట్రంలో డ్రై డేగా ప్రకటించామని, రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా ప్రశాంతంగా ఉన్నాయని డీజీపీ తెలిపారు.