సొంత టీవీ ఛానెళ్లలో ప్రచారంపై ఈసీ ఆసక్తికర వ్యాఖ్యలు!
పత్రికా విలువలు గాలికి వదిలేసి.. జర్నలిజానికి సరిక్త్త అర్ధాల రూపంలో నానార్ధాలు, ప్రతిపదార్ధాలూ సృష్టిస్తున్న రోజులివనే చర్చా నడుస్తుంది.
By: Tupaki Desk | 16 March 2024 5:25 AM GMTఏపీలో అసలు సిసలు రాజకీయం నేటి నుంచి మొదలవుతుంది! ఈ సమయంలో రాజకీయ పార్టీలకు మధ్య జరిగే యుద్ధం ఒకెత్తు.. మీడియాతో చేసే యుద్ధం మరొకెత్తు అన్నట్లుగా పరిస్థితి మారిపోయిందనే చర్చ మొదలైన రోజులివి. పత్రికా విలువలు గాలికి వదిలేసి.. జర్నలిజానికి సరిక్త్త అర్ధాల రూపంలో నానార్ధాలు, ప్రతిపదార్ధాలూ సృష్టిస్తున్న రోజులివనే చర్చా నడుస్తుంది. ఇక ఎన్నికల సమయంలో ఏది ప్రెస్ నోటో, ఏది పెయిడ్ ఆర్టికల్ అనేది సామాన్యుడికి ఒక పట్టాన్న అర్ధంకాని పరిస్థితులు నెలకొంటున్నాయని చెబుతుంటారు. ఈ సమయంలో ఈసీ ఎంటరయ్యింది.
అవును... ఎన్నికలు సమీపిస్తున్న వేళ మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) విషయాలను వెల్లడిస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా... సొంత టీవీ ఛానళ్లు ఉన్న రాజకీయ పార్టీలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... ఇందులో భాగంగా సొంతంగా టీవీ ఛానళ్లు ఉన్న రాజకీయ పార్టీలు.. తమ తమ అభ్యర్థులకు వాటిలో అనుకూలంగా ప్రచారం చేస్తే, ఆ ఖర్చులను లెక్కేసి అది వారి వారి ఎన్నికల వ్యయంగా పరిగణిస్తామని అన్నారు.
ఇదే సమయంలో పార్టీలకు మద్దతుగా ప్రభుత్వ ఉద్యోగులు ప్రచారం చేయడం, రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడం సర్వీసు నిబంధనలకు విరుద్ధమని తెలిపిన ముకేష్ కుమార్ మీనా... అటువంటి ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇదే క్రమంలో... రానున్న ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటే.. దానికి ఆయా జిల్లాల ఎస్పీలనే బాధ్యులను చేస్తామని, వారిపై చర్యలు తీసుకుంటామని మీనా స్పష్టం చేశారు. ఇక రీపోలింగ్ కు ఎక్కడా ఆస్కారం ఇవ్వకూడదని తెలిపారు.
ఇక ప్రధానంగా ప్రచార మాధ్యమాల్లో ప్రచురించే, ప్రసారం చేసే ప్రకటనలు, పెయిడ్ ఆర్టికల్స్ విషయంలోనూ ఈసీ కీలక విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా... ప్రసార మాధ్యమాల్లో ప్రచురించే ప్రకటనలకు ముందుగా ఎన్నికల సంఘం నుంచి అనుమతి తీసుకోవాలని.. ఆయా ప్రకటనల్లో ఎక్కడా అటువంటి అభ్యంతరకర అంశాలూ ఉండకూడదని.. ఇదే సమయంలో పెయిడ్ ఆర్టికల్స్ పై నిఘా ఉంటుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు!