స్వైప్ తగ్గింది స్మార్ట్ పెరిగింది... ఈ-కామర్స్ సైట్స్ లో కొత్త ట్రెండ్!
అవును... భారతదేశంలో తాజాగా జరిగిన ఈ-కామర్స్ వ్యాపారం, అందుకు ఉపయోగించిన చెల్లింపులు మొదలైన విషయాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా స్పందించింది.
By: Tupaki Desk | 26 Oct 2023 11:30 PM GMTఒకానొక సమయంలో ఆన్ లైన్ షాపింగ్ అంటే ఓన్లీ మెట్రో సిటీస్ లో ప్రజానికం మాత్రమే ఆసక్తి చూపించేవారని చెబుతుంటారు. అయితే కాలక్రమంలో భారతదేశంలో గ్రామీణ ప్రాంతాలలో సైతం ఈ కామర్స్ సైట్స్ హవా రోజు రోజుకీ పెరిగిపోతుంది. ఇందులో భాగంగా... ఆన్ లైన్ షాపింగ్ చేయడానికి మొగ్గు చూపిస్తున్నారు. ఇక పండగల సీజన్ వచ్చిందంటే చెప్పేపనిలేదు.. వాళ్లు ఇచ్చే ఆఫర్లకు పోటీగా షాపింగ్స్ నడుస్తుంటాయి! ఈ సమయలో ఆర్బీఐ ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
అవును... భారతదేశంలో తాజాగా జరిగిన ఈ-కామర్స్ వ్యాపారం, అందుకు ఉపయోగించిన చెల్లింపులు మొదలైన విషయాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా స్పందించింది. ఇండియాలోని ఈ-కామర్స్ షాపింగ్ లో ఇండియన్స్ సరికొత్త ట్రెండ్ ని ఫాలో అవుతున్నారని ఆర్బీఐ తెలిపింది. ఇందులో భాగంగా... ఒకప్పుడు ఆన్ లైన్ షాపింగ్ కోసం ఎక్కువగా డెబిట్ కార్డు లేదా క్యాష్ ఆన్ డెలివరీ (సీఓడీ) ఆప్షన్ ను ఎంచుకునే వారని.. కానీ ప్రస్తుతం ఈ ట్రెండులో మార్పు కనిపిస్తోందని చెబుతున్నారు.
ఈ క్రమంలో... డెబిట్ కార్డుల వినియోగం క్రమంగా తగ్గుతూ, యూపీఐ పేమెంట్స్ క్రమంగా పెరుగుతున్నాయ్యని ఆర్బీఐ చెబుతోంది. ఇందులో భాగంగా... ప్రజలు ఈ కామర్స్ సైట్స్ లో యూపీఐ పేమెంట్స్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు ఆర్‌బీఐ తాజా గణాంకాలు చెబుతున్నాయని తెలుస్తుంది. ఆ లెక్కలేమిటనేది ఇప్పుడు చూద్దాం..!
ఆర్బీఐ చెబుతున్న గణాంకాల ప్రకారం... గతేడాది ఈ కామర్స్ సైట్స్ లో డెబిట్ కార్డుల ద్వారా 117 మిలియన్ల లావాదేవీలు నమోదుకాగా, ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ఈ సంఖ్య సగానికి పైగా తగ్గిందని ఆర్బీఐ వెల్లడించింది. ఇందులో భాగంగా... డెబిట్ కార్డ్ లావాదేవీలు 51 మిలియన్లకు పడిపోయిందని తెలిపింది. వీటి మొత్తం గతంలో రూ. 21,000 కోట్లు ఉండగా.. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి రూ. 16,127 కోట్లకు తగ్గింది.
డెబిట్ కార్డుల పరిస్థితి ఇలా ఉంటే... మరోవైపు యూపీఐ పేమెంట్స్ మాత్రం విపరీతంగా పెరుగుతున్నాయి. తాజా ఘణాంకాల ప్రకారం గతేడాది యూపీఐ ద్వారా చేసిన చెల్లింపుల సంఖ్య 2.2 బిలియన్ల కాగా... ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ఆ సంఖ్య 6.1 బిలియన్లకు చేరింది. కాస్త తక్కువ పేమెంట్స్ అన్నింటికీ వినియోగదారులు యూపీఐ పేమెంట్ ఆప్షన్ నే ఎంచుకుంటున్నారని ఆర్బీఐ చెబుతుంది.
ఆన్ లైన్ షాపింగ్ లో డెబిట్ కార్డుల ఎంపిక అలా తగ్గిపోతుంటే.. యూపీఐ పేమెంట్స్ ఎంపిక ఇలా పెరిగిపోతుంటే... క్రెడిట్ కార్డ్ వినియోగం కూడా పెరగడం గమనార్హం. ఇందులో భాగంగా... గతేడాది 107 మిలియన్ల క్రెడిట్ కార్డు లావాదేవీలుగా జరగగా, ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ఈ సంఖ్య 131 మిలియన్లుగా ఉందని ఆర్బీఐ ఘణాంకాలు చెబుతున్నాయి.
దీంతో... యూపీఐ ద్వారా చెల్లింపులు చాలా సులభంగా ఉండటంవల్లే డెబిట్ కార్డుల వినియోగం తగ్గుతున్నట్లు ఆర్థిక రంగ నిణులు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో... కాస్త పెద్ద పెద్ద వస్తువులు కొనడానికి ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోవడంతో క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ పెరుగుతున్నాయని చెబుతున్నారు. ఏది ఏమైనా... ప్రస్తుతం ఈ-కామర్స్ ట్రెండ్ ఒకలెక్కన జరుగుతుందనేది మాత్రం వాస్తవం!!