జీడీపీ పతనం.. మోడీ సర్కారు ఎఫెక్ట్ ఎలా ఉంటుంది?
ప్రధానంగా పెట్రోలు, ఇతర ఇంధనాల ధరలు నిలకడగా కొనసాగాయి.
By: Tupaki Desk | 1 Dec 2024 2:30 AM GMT2024-25 ఆర్థిక సంవత్సరంలో రెండో త్రైమాసికంలో గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్(జీడీపీ) వృద్ధి రేటు పతనమైం ది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు తాజాగా వెల్లడించాయి. జీడీపీ వృద్ధి రేటు 5.4 శాతానికి పతనమైందని పేర్కొన్నాయి. వాస్తవానికి గత నెల వరకు ఇది 7 శాతానికి అటు ఇటుగా ఉంది. దీంతో ధరలు నిలకడగా కొనసాగాయి. ప్రధానంగా పెట్రోలు, ఇతర ఇంధనాల ధరలు నిలకడగా కొనసాగాయి. కానీ, ఇప్పుడు జీడీపీ వృద్ధి దారుణంగా పడిపోయింది.
ఇక, రిజర్వ్ బ్యాంకు అంచనాల ప్రకారం కూడా 6 శాతం వద్ద జీడీపీ వృద్ది కొనసాగాలి. కానీ, అనూహ్యంగా వృద్ధి రేటు తగ్గిందని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొన్నారు. ప్రధానంగా మైనింగ్, గనుల రంగాల్లో వృద్ధి రేటు క్షీణించిందని ఆర్థిక శాఖ తెలిపింది. ప్రాధాన్య రంగాలైన బొగ్గు, ముడి చమురు, సహజ వాయుడు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, స్టీల్, సిమెంటు, విద్యుత్ వంటి 8 రంగాల్లో జీడీపీ తగ్గినట్టు వివరించింది. ఇది దేశ ఆర్థిక వ్యవస్తపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపించనుంది.
కాంగ్రెస్ విమర్శలు..
జీడీపీ పతనంపై కాంగ్రెస్ పార్టీ నిప్పులు చెరిగింది. జీడీపీ వృద్ధి రేటు పతనానికి మోడీ ప్రబుత్వం అనుస రిస్తున్న విధానాలే కారణమని పేర్కొంది. గత ఐదేళ్లలో 0.01శాతం మేరకుజీడీపీ తగ్గినట్టు పేర్కొంది. ప్రజల కొనుగోలు శక్తి క్షీణించడమే దీనికి కారణమనిపేర్కొంది. వేతనాల పెంపు లేకపోవడం, ప్రజల చేతిలో సొమ్ములు లేకపోవడం, అయిన దానికీ కాని దానికీ పన్నులు వేయడం ద్వారా ప్రజల కొనుగోలు శక్తి క్షీణించేలా చేశారని కాంగ్రెస్ దుయ్యబట్టింది.
ఏం జరుగుతుంది?
జీడీపీ వృద్ధి రేటును పెంచుకునేందుకు ఆర్బీఐ రంగంలోకి దిగే అవకాశం ఉంది. తద్వారా గృహ, వాహన, సహా పర్సనల్ రుణాలపై వడ్డీలను పెంచేందుకు అవకాశం ఉంది. గత ఆరు మాసాలుగా నిలకడగా ఉన్న వడ్డీ రేట్లను ఇప్పుటు పెంచే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా కేంద్రం పరంగా చమురు ధరలను సమీక్షించే అవకాశం ఉంది. బంగాళా దుంపలు, బియ్యంపై ధరలు పెంచే అవకాశం ఉంది. అదేవిధంగా బొగ్గు, ముడిచమురు ఉత్పత్తులపై సుంకాలు విధించి.. తద్వారా జీడీపీని పెంచుకునే ఛాన్స్ ఉంటుంది. ఇదే జరిగితే ప్రజలపై మరిన్ని పన్ను భారాలు పడనున్నాయి.