ఎన్నికల కసరత్తు స్టార్ట్ చేసిన ఈసీ... అధికారులకు ట్రైనింగ్ షురూ!
తెలంగాణ వ్యాప్తంగా బూత్ లెవల్ అధికారుల కు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) సమగ్ర శిక్షణా కార్యక్రమాల ను ప్రారంభించిందని తెలుస్తుంది.
By: Charan Telugu | 17 July 2023 10:10 AM GMTఅసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ లో ఎన్నికల కమిషన్ కసరత్తులు స్టార్ట్ చేసిందని తెలుస్తుంది. ఇందులో భాగంగా... ఎన్నికల కు సంబంధించి వివిధ పనులు పూర్తిచేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారని తెలుస్తుంది. దీంతో... తెలంగాణ లో ఎన్నికల సందడి మొదలైందని అంటున్నారు పరిశీలకులు!
అవును... ఎన్నికల సన్నాహాల్లో భాగం గా తెలంగాణ వ్యాప్తంగా బూత్ లెవల్ అధికారుల కు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) సమగ్ర శిక్షణా కార్యక్రమాల ను ప్రారంభించిందని తెలుస్తుంది. ఇందులో భాగంగా... రాష్ట్రం లోని 33 జిల్లాల కు చెందిన 34,891 మంది బూత్ స్థాయి అధికారులకు హైదరాబాద్ లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారని అంటున్నారు.
రకరకాల కారణాల తో ఇటీవల తెలంగాణ ఎన్నికల సంఘం లో పలువురు అధికారుల ను మార్చి కొత్త నియామకాలు చేపట్టారంటూ కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... పోలింగ్ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూడటంతోపాటు ఎన్నికల సంఘం మార్గదర్శకాల ను కచ్చితంగా అమలు చేయడంలో ఈ అధికారులదే కీలక పాత్ర అని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ఉద్ఘాటించారని అంటున్నారు.
ఇదే సమయం లో పోలింగ్ బూత్ కు సంబంధించిన అన్ని అంశాల ను పర్యవేక్షించాల్సిన బాధ్యత బూత్ లెవల్ అధికారులదేన ని తెలిపిన ఆయన... ఓటరు జాబితా సవరణలో బూత్ లెవల్ అధికారులదే కీలకపాత్ర అని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఈ నెల 18న అసెంబ్లీ స్థాయి మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనుందని తెలుస్తుంది. అనంతరం జులై 19 నుంచి 25 వరకు జిల్లాల వారీగా శిక్షణ తరగతులు నిర్వహించనున్నారని అంటున్నారు.
ఓటరు జాబితా నవీకరణ, సవరణల్లో బూత్ లెవల్ అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపిన వికాస్ రాజ్... ఓటర్ల జాబితా సవరణ రెండో విడతలో అర్హులైన ఓటర్లను చేర్చేందుకు ఇంటింటికి తిరిగి సమీక్షలు నిర్వహించే బాధ్యత ను ఈ అధికారుల కు అప్పగించినట్లు తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమాల లక్ష్యం బూత్ స్థాయి అధికారుల కు అవసరమైన నైపుణ్యాలతో సాధికారత కల్పించడమేనని స్పష్టం చేశారు.