టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి ఆస్తుల జప్తు
బ్యాంకును మోసం చేసిన కేసులో ఆయనకు చెందిన 48 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను జప్తు చేసింది.
By: Tupaki Desk | 25 Dec 2024 6:49 AM GMTటీడీపీ సీనియర్ నేత, నరసారావుపేట మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు ఈడీ ఝలక్ ఇచ్చింది. బ్యాంకును మోసం చేసిన కేసులో ఆయనకు చెందిన 48 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను జప్తు చేసింది. రాయపాటికి చెందిన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్ స్ట్రాయ్ ఇండియా లిమిటెడ్ (టీఐఎల్) బ్యాంకుల నుంచి అప్పు తీసుకుని తిరిగి చెల్లించలేదు. దీంతో ఈడీ చర్యలు తీసుకుంది.
ఈడీ జప్తు చేసిన ఆస్తులలో వ్యవసాయ, నివాస స్థలాలు ఉన్నాయి. బ్యాంకుల నుంచి అప్పుగా తీసుకున్న మొత్తంలో రూ.85.90 కోట్లను డైరెక్టర్లు ప్రమోటర్లు తమ సొంత ఖాతాలకు మళ్లించినట్లు అభియోగాలు నమోదయ్యాయి. షెల్ కంపెనీలు ఏర్పాటు, అక్రమ నగదు బదిలీ చేశారని బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేయడంతో ట్రాన్స్ స్ట్రాయ్ పై ఫిర్యాదు చేయడంతో ఈడీ కేసు నమదు చేసింది.
ట్రాన్స్ స్ట్రాయ్ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని నిధులు వినియోగించుకున్న ప్రయోజనాలకు ఉపయోగించలేదని ఈడీ తెలిపింది. కంపెనీ నిరంతర అక్రమాలు, లెటర్స్ ఆఫ్ క్రెడిట్ తరచుగా పంపిణీ చేయడం, వర్కింగ్ క్యాపిటల్ పరిమితులపై వడ్డీని చెల్లించకపోవడం, కన్సార్టియం బ్యాంకుల ద్వారా కార్యకలాపాలను రూట్ చేయకపోవడం వల్ల ఈ రుణ ఖాతాలు ఎన్పీఏగా మారాయి.
రుణం తీసుకున్న కంపెనీలు దాని గ్రూప్ కంపెనీలు, షెల్ ఎంటీటీలు, ప్రమోటర్లు, డైరెక్టర్ల యజమాన్యం నియంత్రణలో ఉన్న అనేక కంపెనీలకు మళ్లించారని ఈడీ తెలిపింది. అధిక టర్నోవర్ చూపడం ద్వారా ఎప్పటికప్పుడు క్రెడిట్ సౌకర్యాలను పొందినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. వసతి కల్పించిన ఎల్సీలను తెరవడం ద్వారా నిధులు మోసపూరితంగా దారి మళ్లించారు.