Begin typing your search above and press return to search.

వైసీపీ మాజీ ఎంపీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది

2019లో ట్రయాంగిల్ ఫైట్ లో ఆయన 4000 వేల ఓట్ల స్వల్ప మార్జిన్ తో నెగ్గారు.

By:  Tupaki Desk   |   19 Oct 2024 3:45 PM GMT
వైసీపీ మాజీ ఎంపీ  చుట్టూ ఉచ్చు బిగుస్తోంది
X

రాజకీయంగా వస్తూనే జాక్ పాట్ కొట్టి అయిదేళ్ల పాటు విశాఖ వంటి ప్రతిష్టాత్మకమైన ఎంపీ సీటు నుంచి ఢిల్లీ పార్లమెంట్ కి వెళ్ళిన ఎంవీవీ సత్యనారాయణకు ఇపుడు గడ్డు కాలం నడుస్తోంది అని అంటున్నారు. 2019లో ట్రయాంగిల్ ఫైట్ లో ఆయన 4000 వేల ఓట్ల స్వల్ప మార్జిన్ తో నెగ్గారు. ఆనాడు జనసేన ఒంటరిగా పోటీ చేయడమే ఆయనకు ప్లాస్ పాయింట్ అయింది.

ఇక 2024 వచ్చేసరికి ఎంపీగా కాదు ఎమ్మెల్యేగా చేస్తాను అని చెప్పి విశాఖ తూర్పు వంటి టీడీపీకి బలమైన నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. ఆయన ఆ ఎన్నికల్లో గెలించేందుకు దాదాపుగా వంద కోట్ల దాకా ఖర్చు చేశారు అని ప్రచారం అయితే నడచింది. అయితే వ్రతం చెడింది ఫలితం దక్కలేదు అన్నట్లుగా ఏకంగా డెబ్బై వేల భారీ ఓట్ల తేడాతో ఓటమిని చవిచూసారు.

ఇక ఓడిన తరువాత ఆయన వైసీపీ రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తన మీద టీడీపీ కూటమి ప్రభుత్వం నుంచి టార్గెట్ ఉంటుందని ఆయన ముందే ఊహించి జాగ్రత్త పడ్డారు అని అంటున్నారు. అదే టైం లో వైసీపీ అధినాయకత్వానికి కూడా ఆయన ఇదే విషయం చెప్పి రాజకీయాలకు సెలవు అని కూడా అన్నారని పుకార్లు షికారు చేశాయి.

ఇంత చేసినా ఆయన మీద కేసులు తప్పడం లేదు. విశాఖలో ఆయన లేటెస్ట్ గా విశాఖలోని హయగ్రీవా భూముల కేసునకు సంబంధించి కోర్టులో ముందస్తు బెయిల్ దక్కింది. దాంతో కొంత ఊరట అయితే దక్కింది.వృద్ధుల కోసం 2008లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం విశాఖలోని ఎండాడ వద్ద ఇచ్చిన 15 ఎకరాల అత్యంత ఖరీదైన భూమిని వైసీపీ అధికారంలోకి వచ్చాక వెనక్కి తీసుకున్నారని హయగ్రీవ ఇన్ఫోటెక్ ఎండీ హోదాలో జగదీశ్వరుడు ఆరోపణలు చేశారు.

దాంతో దీని మీద మాజీ ఎంపీ ఆయన అనుచరుల మీద కేసు విశాఖలోని పోలీస్ స్టేషన్ లో నమోదు అయింది. ఈ కేసులో కోర్టుకు వెళ్ళిన మాజీ ఎంపీకి అరెస్ట్ చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని చెప్పిన కోర్టు ముందస్తు బెయిల్ ని మాత్రం మంజూరు చేసింది. ఆ విధంగా కొంత ఊరట పొందిన ఎంవీవీని ఇపుడు ఈడీ దాడులతో మరో పెద్ద ట్రబుల్ ఎదురైంది.

విశాఖలోని మాజీ ఎంపీ రియల్ ఎస్టేట్ ఆఫీసు మీద అలాగే ఆయన నివాసాల మీద ఏక కాలంలో ఈడీ దాడులు చేయడంతో ఆయన ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని అంటున్నారు. ఈడీ దాడులలో ఏ వివరాలు సేకరించిందో తెలియదు కానీ మాజీ ఎంపీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది అని అంటున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే ఎంవీవీ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు తన వంతు ప్రయత్నాలు మొదలెట్టారని అంటున్నారు. ఆయన ఈ మేరకు ఒక మాజీ మంత్రి ద్వారా రాయబారాలు సాగించారని కూడా ప్రచారం సాగింది. అయితే మాజీ ఎంపీని పార్టీలోకి తీసుకోవద్దని కూటమిని నేతలతో పాటు టీడీపీ తమ్ముళ్ళు అధినాయకత్వానికి చెబుతున్నారు.

అయితే అంగబలం అర్ధబలం కలిగిన ఎంవీవీ విషయంలో ఉన్నత స్థాయిలోనే రాయబారాలు సాగుతున్నాయని అంటున్నారు. దాంతో ఆయనను ఫుల్ గా టార్గెట్ చేస్తున లక్ష్యం ఏమిటి అన్నది కూడా కొద్ది రోజులలో తెలుస్తుంది అని అంటున్నారు. ఏది ఏమైనా బిగ్ షాట్ గా విశాఖలో బిల్డర్ గా పేరు తెచ్చుకున్న ఎంవీవీకి ఇపుడు కష్టాలు చుట్టు ముడుతున్నాయి. ఆయన వీటి నుంచి బయటపడం ఎలా అన్నదే ఆయన అనుచరులలో కూడా ఆవేదనగా ఉంది అని అంటున్నారు.