Begin typing your search above and press return to search.

బిగ్ బ్రేకింగ్... కేటీఆర్ కు ఈడీ నోటీసులు!

తెలంగాణ రాజకీయాల్లో ఫార్ములా ఈ-రేసు కేసు తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   28 Dec 2024 5:16 AM GMT
బిగ్  బ్రేకింగ్... కేటీఆర్ కు ఈడీ నోటీసులు!
X

తెలంగాణ రాజకీయాల్లో ఫార్ములా ఈ-రేసు కేసు తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ఇటీవల ఏసీబీ కేసు నమోదు చేయగా.. అనంతరం ఈడీ కూడా ఈసీఐఆర్ నమోదు చేసిందనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా.. కేటీఆర్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది.

అవును... ఫార్ములా ఈ-రేసు కేసులో బీఆరెస్స్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు జనవరి 7న విచారణకు రావాలని అందులో పేర్కొంది. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్.ఎం.డీ.ఏ. మాజీ చీఫ్ ఇంజినీర్ బీ.ఎల్.ఎన్. రెడ్డికి కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది.

ఈ నేపథ్యంలో కేటీఆర్ కంటే ముందే.. అంటే.. జనవరి 2, 3 తేదీల్లో విచారణకు రావాలని అరవింద్ కుమార్, బీ.ఎల్.ఎన్. రెడ్డికి ఇచ్చిన నోటీసుల్లో పేర్కొంది. దీంతో... నూతన సంవత్సరం మొదట్లో తెలంగాణ రాజకీయాల్లో హాట్ హాట్ టాపిక్స్ తెరపైకి వచ్చే అవకాశం ఉందనే చర్చ తెరపైకి వచ్చింది.

కాగా... ఫార్ములా-ఈ కార్ రేసు వ్యవహరంలో కేటీఆర్ ను ఏ1 గా పేర్కొంటూ ఏసీబీ ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయగా.. ఆ ఎఫ్.ఐ.ఆర్. ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీ.ఎం.ఎల్.ఏ) ప్రకారం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట (ఈడీ) అధికారులు కేటీఆర్, అర్వింద్ కుమార్, బీ.ఎల్.ఎన్. రెడ్డిపై ఈడీ కేసు నమోదు చేశారు.

మరోపక్క.. ఫార్ములా-ఈ కార్ రేస్ వ్యవహారంలో ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్.ఐ.ఆర్.ను క్వాష్ చేయాలని డిసెంబర్ 20న తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలూ చేయగా.. దానిపై విచారణ జరిగింది. ఈ సమయంలో.. అవినీతి నిరోధక చట్టం కింద సెక్షన్లు ఈ కేసుకు వర్తించవని కేటీఆర్ తరుపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు.

మరోపక్క ప్రాథమిక దర్యాప్తు ఇప్పటికే పూర్తి అయిన నేపథ్యంలో... మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని, గవర్నర్ ఆమోదించిన తర్వాతే కేసు నమోదు చేశామని రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఏజీ సుదర్శన్ రెడ్డి తమ వాదనలు వినిపించారు. ఈ సమయంలో.. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు.. ఈ నెల 30 వరకూ కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది.

అదేవిధంగా... కేటీఆర్ పై ఏసీబీ నమోదు ఏసిన కేసులో దర్యాప్తు కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది. ఇందులో భాగంగా.. తాజాగా కేటీఆర్ తో అరవింద్ కుమార్, బీ.ఎల్.ఎన్. రెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చింది.