Begin typing your search above and press return to search.

కెనడాలో సిక్కు వ్యక్తి, అతని కొడుకుబలైన వీడియో వైరల్!

కెనడాలోని ఎడ్మోంటన్‌ లో హర్‌ ప్రీత్ సింగ్, అతని కుమారుడు ఒక షాకింగ్ సంఘటనలో కాల్చి చంపబడ్డ ఘటనకూ సంబంధించిన వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది

By:  Tupaki Desk   |   15 Nov 2023 4:53 AM GMT
కెనడాలో సిక్కు వ్యక్తి, అతని కొడుకుబలైన వీడియో వైరల్!
X

కెనడాలో వ్యవస్థీకృత నేరాల్లో పేరుమోసినట్లు చెబుతున్న భారత సంతతి సిక్కు వ్యక్తి హర్‌ ప్రీత్‌ సింగ్‌ ఉప్పల్‌ (41), అతడి కుమారుడు (11) లను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఎడ్మంటన్‌ నగరంలో ఒక పెట్రోల్‌ పంపు వద్ద ఈ ఘటన జరిగింది. ఈ సమయంలో వారిపై కాల్పులు జరిపిన వ్యక్తి పరారీలో ఉన్నాడు! ఈ సమయంలో దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు వైరల్ గా మారింది.

అవును... కెనడాలోని ఎడ్మోంటన్‌ లో హర్‌ ప్రీత్ సింగ్, అతని కుమారుడు ఒక షాకింగ్ సంఘటనలో కాల్చి చంపబడ్డ ఘటనకూ సంబంధించిన వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ ఘటన జరిగిన సమయంలో సమీపంలోని సీసీ కెమెరాలో ఈ దారుణ ఘటన రికార్డ్ అయ్యింది. వీరు ప్రయాణిస్తున్న కారులో ఉన్నట్లు తెలుసుకున్న తర్వాత ఉద్దేశపూర్వకంగా వారిని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారని పోలీసులు ముందునుంచీ చెబుతూనే ఉన్నారు!

ఆ వీడియోలో కాల్పుల తరువాత, నిందితుడు సంఘటనా స్థలం నుంచి పారిపోయాడు. అతనిని గుర్తించడానికి పోలీసుల ప్రయత్నాలలో భాగంగా వీడియో ఫుటేజీని విడుదల చేశారని చెబుతున్నారు. అయితే ఈ రెండు హత్యలకు బలమైన కారణాలే ఉండి ఉంటాయని అనుమానిస్తున్నప్పటికీ... అందుకు సంబంధించిన పూర్తి క్లారిటీ ఇంకా తెరపైకి రాలేదు.

కాగా... ఆ హత్య జరిగిన సమయంలో హర్‌ ప్రీత్‌ కారులో అతడి కుమారుడి స్నేహితుడైన మరో బాలుడు కూడా ఉన్నప్పటికీ... అతడు మాత్రం క్షేమంగా బయటపడిన సంగతి తెలిసిందే. ఇక... హర్‌ ప్రీత్‌ పై మాదకద్రవ్యాలు, మానవ అక్రమ రవాణా, చట్టవిరుద్ధంగా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కలిగి ఉండటం, ఆయుధాలతో దాడి చేయడం, అక్రమంగా తుపాకీని కలిగి ఉండటం వంటి అభియోగాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు!

ఇదే సమయంలో... ఉప్పల్ మరణానికి ఒక రోజు ముందు టొరంటోలో ఇటీవల యూఎన్ గ్యాంగ్‌ స్టర్ పర్మ్‌ వీర్ చాహిల్ హత్య కూడా ఈ జంట హత్యలకు వెనుకున్న బలమైన కారణం అయ్యి ఉండెచ్చనే దిశగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలుస్తుంది. ఇలా 11 ఏళ్ల బాలుడితో పాటూ ఒక వ్యక్తి హత్య జరగడం కెనడాలోని ఇతర ప్రాంతాలలో హింసాత్మక పరిస్థితులు నెలకొనకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు పోలీసులు చెప్పిన సంగతి తెలిసిందే.