బీఆరెస్స్ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు... తెరపైకి రూ.300 కోట్ల అక్రమాలు!
ఈ క్రమంలో తాజాగా పటాన్ చెరు బీఆరెస్స్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహించారు.
By: Tupaki Desk | 22 Jun 2024 3:57 AM GMTప్రస్తుతం బీఆరెస్స్ నేతలకు ఫుల్ బ్యాడ్ టైం నడుస్తుందనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బీఆరెస్స్ కు టైం ఏమాత్రం బాగాలేదని, అందువల్లే దెబ్బ మీద దెబ్బ తగులుతుందనే చర్చ రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా పటాన్ చెరు బీఆరెస్స్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహించారు.
అవును... తాజాగా బీఆరెస్స్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆయనతోపాటు.. అతని సోదరుడు మధుసూదన్ రెడ్డి.. మైనింగ్ వ్యవహారంలో ప్రభుత్వానికి రూ.39 కోట్ల నష్టం చేకూర్చినట్లు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు గుర్తించారంట. ఈ క్రమంలోనే మొత్తం రూ.300 కోట్ల మైనింగ్ అక్రమాలు జరిగినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు.
మైనింగ్ పేరుతో మహిపాల్ రెడ్డి సోదరులు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారంటూ వారి నివాసాల్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు. దీంతో... సంతోష్ గ్రానైట్, సంతోష్ సాండ్ కంపెనీల ద్వారా అక్రమాలు కొనసాగించారని అధికారులు చెబుతున్నారని తెలుస్తుంది! ఈ సమయంలో అధికారులు రూ.19 లక్షల నగదు గుర్తించినట్లు చెబుతున్నారు. ఈ మేరకు ఈడీ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు!
ఇందులో భాగంగా... మనీలాండరింగ్, హవాలా నేపథ్యంలో సోదాలు చేసినట్లు చెప్పిన అధికారులు... బ్యాంక్ ఖాతాల్లో కూడా అక్రమ లావాదేవీలను గురించినట్లు తెలిపారు! ఇలా అక్రమ మార్గంలో సంపాదించిన డ్దబ్బు మొత్తాన్ని స్థిరాస్తి రంగంలో పెట్టుబడులుగా పెట్టినట్లు ఈడీ పేర్కొంది. ఇదే సమయంలో మనికొన్ని బ్యాంక్ లాకర్లను తెరవాల్సి ఉందని.. ఈ సోదరులకు పలువురు బినామీలు ఉన్నట్లు బయటపడిందని అధికారులు వెల్లడించారు.
రాజకీయ కక్షతోనే ఈడీ దాడులు - మహిపాల్ రెడ్డి:
పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుల ఇంటితో పాటు ఆయన బంధువుల నివాసాలపైనా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఈ దాడులు రాత్రి 7 గంటలవరకూ కొనసాగాయని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మహిపాల్ రెడ్డి స్పందించారు.
ఇందులో భాగంగా... తనను రాజకీయంగా ఎదుర్కోలేకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కక్షపూరితంగా ఈడీ, ఐటీ దాడులు చేయిస్తున్నట్లు మహిపాల్ రెడ్డి ఆరోపించారు. ఈడీ అధికారులు జరిపిన సోదాలకు తాను, తన కుటుంబ సభ్యులు పూర్తిగా సహకరించినట్లు తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి వ్యాపారాలు నిర్వహించలేదని తెలిపారు.