Begin typing your search above and press return to search.

ష‌ర్మిల‌క్క క‌న్నా.. ఈ బ‌ర్రెలక్కే బెట‌ర్‌: నెటిజ‌న్ల ట్రోల్స్‌

అయినా.. ధైర్యం చేసింది. తెగువ చూపింది. కోట్ల‌కు కోట్లు ఖ‌ర్చు పెట్టే నాయ‌కులతో ఢీ అంటే ఢీ అనేందుకు రెడీ అయింది.

By:  Tupaki Desk   |   9 Nov 2023 4:20 AM GMT
ష‌ర్మిల‌క్క క‌న్నా.. ఈ బ‌ర్రెలక్కే బెట‌ర్‌:  నెటిజ‌న్ల ట్రోల్స్‌
X

ఆమె ప‌క్క‌న సోద‌రుడు త‌ప్ప మ‌రెవ‌రూ లేరు. ఆమెకు నా అని అనుకునే నాయ‌కుడు కూడా లేదు. పిలిచి టికెట్ ఇచ్చేవారు అంత‌క‌న్నా లేరు. అయినా.. ధైర్యం చేసింది. తెగువ చూపింది. కోట్ల‌కు కోట్లు ఖ‌ర్చు పెట్టే నాయ‌కులతో ఢీ అంటే ఢీ అనేందుకు రెడీ అయింది. స్వ‌యంగా.. వ‌చ్చి నామినేష‌న్ వేసింది. ఆమే.. ప‌ట్టుమ‌ని పాతికేళ్లు కూడా నిండ‌ని బ‌ర్రెల‌క్క‌గా పేరొందిన శిరీష‌ యూట్యూబ‌ర్‌. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తూ.. ప్రాచుర్యం పొందారు. నాగ‌ర్ క‌ర్నూలు జిల్లాలోని కొల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆమె నామినేష‌న్ వేశారు.

ఆమె ఈ మ‌హా ఎన్నిక‌ల స‌మ‌యంలో చేతులు ఎత్తేయొచ్చు. ఘోరంగా ఓడిపోనూ వ‌చ్చు. డిపాజిట్లు ద‌క్కించుకునేంత ఓట్లు కూడా రాక‌పోవ‌నూ వ‌చ్చు. కానీ, ఆమె సాహ‌సం.. స‌మాజానికి ఏదైనా చేయాల‌నే త‌లంపు అంద‌రినీ నిభిడాశ్చ‌ర్యానికి గురి చేస్తున్నాయి. ``రాష్ట్రంలో నిరుద్యోగ స‌మ‌స్య ప‌ట్టిపీడిస్తోంది. దీనికి ఏదైనా చేయాల‌ని అనిపించింది. ఎమ్మెల్యే అయితేనే ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూప‌గ‌ల‌ను. అందుకే ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతున్నా`` అని వెల్ల‌డించిన శిరీష ఇప్పుడు అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంటున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తెర‌మీదికి వ‌చ్చిన చిత్ర‌మైన ఘ‌ట్టం ఇప్పుడు నెటిజ‌న్ల మెప్పు పొందుతోంది. ఇదే స‌మ‌యంలో తెలంగాణ కోడ‌లిన‌ని, తెలంగాణ‌లో రాజ‌న్న రాజ్యం తీసుకువ‌స్తాన‌ని డంబాలు చెప్పుకొన్న‌, గొప్ప‌లు పోయిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి ష‌ర్మిల‌ను నెటిజ‌న్లు ఓ ఆట ఆడేసుకుంటున్నారు. ``ష‌ర్మిల‌క్క క‌న్నా.. ఈ బ‌ర్రెల‌క్క బెట‌ర్ బ్రో!`` అంటూ యువ‌త ట్రోల్స్ చేస్తున్నారు. ఆమె కు తాము మ‌ద్ద‌తుగా ఉంటామ‌ని మ‌రికొంద‌రు వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఇంకొంద‌రు నీ ఫోన్ పే చెప్ప‌క్కా.. ప్ర‌చారానికి నిధులు ఇస్తామ‌ని చెబుతున్నారు. మ‌రికొంద‌రు.. ష‌ర్మిల క‌న్నా.. నువ్వే పార్టీ పెట్ట‌క్కా.. మేం నీతో క‌లిసి న‌డుస్తామ‌ని అంటున్నారు. మొత్తానికి బ‌ర్రల‌క్క ఓడిపోయినా.. ప్ర‌జాభిమానం మాత్రం ఆమె సొంతం చేసుకోవ‌డం గ‌మ‌నార్హం.