11 నిమిషాల్లోనే వెళ్లిపోయిన జగన్.. ఈనాడు సెటైర్లు!!
వైసీపీని11 వదలడంలేదు. ఎన్నికల్లో 11 స్థానాలకే పరిమితమైన వైసీపీని విమర్శించేందుకు ప్రతి ఒక్కరూ 11నే అస్త్రంగా వాడుకుంటున్నారు.
By: Tupaki Desk | 24 Feb 2025 8:41 AM GMTవైసీపీని11 వదలడంలేదు. ఎన్నికల్లో 11 స్థానాలకే పరిమితమైన వైసీపీని విమర్శించేందుకు ప్రతి ఒక్కరూ 11నే అస్త్రంగా వాడుకుంటున్నారు. చివరికి ప్రధాన పత్రికలు సైతం వైసీపీపై విమర్శల బాణాలు సంధించేలా 11నే ప్రయోగిస్తున్నాయి. తాజాగా అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన వైసీసీ 11 నిమిషాల్లోనే సభను విడిచిందని ఈనాడు పత్రిక ప్రస్తావించడం ఆసక్తికరంగా మారింది..
వదల బొమ్మాళి.. నిను వదల అంటూ వైసీపీని 11 వెంటాడుతోంది. ఏ ముహూర్తాన ఎన్నికలు జరిగి ఆ పార్టీ 11 స్థానాలకే పరిమితమైపోయిందో గానీ, ప్రతిసారి ఆ పార్టీని, ఆ పార్టీ అధినేత జగన్ ను ట్రోల్ చేసేలా నెటిజన్లు సైతం పదకొండును వాడుకుని తమ ప్రతాపం చూపుతున్నారు. తాజాగా ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరైన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 11 నిమిషాల్లోనే వాకౌట్ చేశారంటూ ఈనాడు తన కథనంలో ప్రస్తావించింది.
ఇక అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూర్చొన్న బ్లాక్ నెంబర్ కూడా 11 అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. వాస్తవానికి వైసీపీ ప్రజా ప్రతినిధులు బ్లాక్ నెంబర్ 12లో కూర్చున్నారు. కానీ, నెటిజన్లు సోషల్ మీడియాను ఆకర్షించేందుకు బ్లాక్ XII నెంబరును ఎడిట్ చేసి XI మార్చేశారు. దీంతో అసెంబ్లీ సీటింగులోనూ వైసీపీకి 11 నెంబర్ వచ్చిందంటూ ట్రోల్ చేస్తున్నారు.
2019 ఎన్నికల్లో 151 స్థానాలు గెల్చుకుని పవర్ చూపించిన వైసీపీ.. 2024 ఎన్నికల సరికి కుదేలైంది. 151 కాస్త 11కి పడిపోయింది. ఇదే సమయంలో ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ పట్టుబడితే అధికార పక్షం వైసీపీ మధ్యలో ఐదు పోయిందని బావిస్తోందని కాని ఆ పార్టీకి 140 సీట్లు తగ్గిన విషయం గుర్తించడం లేదని విమర్శించేది. ఇక ఈ 9 నెలల్లో వైసీపీని, ఆ పార్టీ అధినేత జగన్ ను ట్రోల్ చేసేందుకు ఎక్కువగా 11నే వాడుతున్నారని చెబుతున్నారు.