అమరావతి స్పీడుకు జనం తోడు
ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ.. తన తండ్రి ఆశయాలను, విలువలను కాపాడుతానన్నారు. అమరా వతి రాజధాని నిర్మాణానికి తమ వంతుగా రూ.10 కోట్ల విరాళం ప్రకటిస్తున్నట్టు కిరణ్ చెప్పారు.
By: Tupaki Desk | 29 Jun 2024 5:30 AM GMTఎవరి రాకతో.. గళమున పాటల ఏరువాక సాగేనో.. అంటారు సినీ కవి సిరివెన్నెల. అచ్చం అలానే.. నిన్న మొన్నటి వరకు ఎవరూ పట్టించుకోని.. అమరావతి రాజధానికి ఇప్పుడు కళ వస్తోంది. చంద్రబాబు అధి కారంంలోకి రాగానే.. అమరావతి పరుగులు పెడుతుందని అందరూ భావిస్తున్నారు. వచ్చీ రావడంతోనే.. అడుగు పెట్టీపెట్టడంతోనే.. చంద్రబాబు అమరావతిలో పర్యటించారు. ఇక్కడ నిర్మాణాలను పరిశీలిం చారు. రాజధానిని పరుగులు పెట్టించాలని నిర్ణయించారు. అంతే! ఇప్పుడు అమరావతి కేక పెడుతోంది.
విరాళాల రూపంలో నిధులు సమకూరుతున్నాయి. రెండు రోజుల కిందట.. కుప్పం మహిళలు 4.5 కోట్ల రూపాయలను చంద్రబాబుకు ఇచ్చారు. తర్వాత.. ఓ విద్యార్థిని తను దాచుకున్న సొమ్ములో నుంచి రూ.5 లక్షలు విరాళంగా అందించింది. మరో మహిళ తన పసుపు-కుంకం కింద వచ్చిన భూమిని అమ్మేసి 10 లక్షల రూపాయలు ఇచ్చింది. ఇలా.. అమరావతి పరుగులు పెట్టేందుకు కావాల్సిన చోదక శక్తి.. విరాళ రూపంలో ఉప్పొంగడం గమనార్హం.
తాజాగా.. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి ఈనాడు గ్రూపు సంస్థలు రూ.10 కోట్ల విరాళం ప్రకటించాయి. ఈ మేరకు ఈనాడు గ్రూపు సంస్థల అధిపతి రామోజీరావు కుమారుడు ఈనాడు ఎండీ కిరణ్ దీనికి సంబంధిం చిన చెక్కును ఏపీ సీఎం చంద్రబాబుకు అందించారు. అమరావతి అభివృద్ధి కావాలని.. అమరావతి ద్వారా రాష్ట్ర ఖ్యాతి ఇనుమడించాలని.. తన తండ్రి రామోజీరావు భావించినట్టు తెలిపారు. తాజాగా విజయవాడ శివారు.. కానూరులో నిర్వహించిన రామోజీ సంస్మరణ సభలో కిరణ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ.. తన తండ్రి ఆశయాలను, విలువలను కాపాడుతానన్నారు. అమరా వతి రాజధాని నిర్మాణానికి తమ వంతుగా రూ.10 కోట్ల విరాళం ప్రకటిస్తున్నట్టు కిరణ్ చెప్పారు. ఈ మేరకు ఆయన సభలోనే సీఎం చంద్రబాబుకు ఈ సొమ్ముకు సంబంధించిన చెక్కును అందించారు. రాష్ట్రంలో నూ.. దేశంలోనూ.. రామోజీరావుకు నివాళులర్పిస్తున్న విషయం.. తెలిసి తాము గర్వపడుతున్నా మన్నా రు. భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాల ప్రజలకు తాము అండగా ఉంటామన్నారు. రామోజీ రావు అమరావతి పూర్తికావాలని కలలు కనేవారని చెప్పారు. మొత్తంగా చంద్రబాబు రాకతో.. అమరావతి కేక పుట్టిస్తుండడం గమనార్హం.