Begin typing your search above and press return to search.

ప్రచండ ఎండల ఎల్ నినో పోయి.. వణికించే లా నినో వస్తోంది..

ప్రస్తుతం వాతావరణ పరిస్థితులను రెండు రకాలు పిలుస్తున్నారు. ఎల్ నినో, లా నినా.

By:  Tupaki Desk   |   14 Jun 2024 5:30 PM GMT
ప్రచండ ఎండల ఎల్ నినో పోయి.. వణికించే లా నినో వస్తోంది..
X

ప్రస్తుతం వాతావరణ పరిస్థితులను రెండు రకాలు పిలుస్తున్నారు. ఎల్ నినో, లా నినా. ఈసారి భారత దేశంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంగతి గుర్తుంది కదా..? రాజస్థాన్ లోని చురు, దేశ రాజధాని ఢిల్లీ, మహారాష్ట్రలోని నాగపూర్ లో 50 డిగ్రీలపైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. దీనికి కారణం..? ఎల్ నినో.. అసలు ఇప్పటికే మనుషులు చేస్తున్న వివిధ చర్యలతో భూమి ఉష్ణోగ్రతలను ఇంకా బాగా పెంచింది ఎల్ నినో.. దీంతోనే వేసవిలో ఎండలు మండిపోయాయి. అలాంటి ఎల్‌ నినో వెళ్లిపోయింది. ఇది ఏడాది కిందట ఏర్పడింది. మనుషుల చర్యల కారణంగా జరిగిన మార్పులతో 12 నెలలుగా అతి తీవ్ర వాతావరణ పరిస్థితులు కనిపించాయి. దీని ఫలితమే రికార్డులను తిరగరాసే ఉష్ణోగ్రతలు.

వచ్చేది లా నినా

ఎల్ నినో పోయిన నేపథ్యంలో లా నినా రానుంది. ఎల్ నినో వెళ్లిపోతున్న స్థితిలో ప్రస్తుతం ప్రపంచం తటస్థ స్థితిలో ఉంది. ఇక ఎల్‌ నినో కారణంగా పసిఫిక్‌ లో వేడెక్కిన ప్రాంతాలు లా నినాలో చల్లబడతాయి. ఇందుకు 65 శాతం వరకు అవకాశం ఉందని అమెరికాలోని ‘మహా సముద్ర వాతావరణ జాతీయ సంస్థ’ గురువారం ప్రకటించింది.

వచ్చే మూడు నెలలు

జూలై, ఆగస్టు, సెప్టెంబరులో లా నినోకు అత్యంత సానుకూలత ఉందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితి కారణంగా.. అట్లాంటిక్‌ మహా సముద్రంలో హరికేన్లు ఎక్కువగా వచ్చే కాలం మరింత క్రియాశీలం అవుతుంది. మరీ ముఖ్యంగా ఆగస్టులో హరికేన్లు ప్రభావం గరిష్ఠ స్థాయికి వెళ్తుందని పేర్కొంటున్నారు.

అమెరికాలో అసాధారణ తుఫాన్లు..

లా నినాకు తోడు, సముద్ర ఉపరితల జలాల ఉష్ణోగ్రతలు కలగలిసి అమెరికాలో అసాధారణ తుఫాన్లకు దారితీస్తాయని చెబుతున్నారు.

అన్నీ ఒకటి కావు..

ఎల్ నినా, లా నినో ప్రతిసారీ ఒకటిగా ఉండవు. అంటే ప్రతి ఎల్ నినా, ప్రతి లా నినోకు దేని ప్రత్యేకతలు దానికి ఉంటాయి.