Begin typing your search above and press return to search.

విప్రో చేతికి 3 సబ్బుల బ్రాండులు.. డీల్ ఎంతంటే?

తాజాగా ఈ సంస్థ మూడు సబ్బుల బ్రాండ్లను సొంతం చేసుకుంది. జో.. డోయ్.. బాక్టీర్ షీల్డ్ పేరుతో ఉన్న మూడు బ్రాండ్లను తన సొంతం చేసుకుంది.

By:  Tupaki Desk   |   6 Dec 2023 4:11 AM GMT
విప్రో చేతికి 3 సబ్బుల బ్రాండులు.. డీల్ ఎంతంటే?
X

విప్రో అన్నంతనే ఐటీ సేవలు అందించే సంస్థ కదా? అని అనుకుంటారు.కానీ.. విప్రో సంస్థ ఐటీ సేవలతో పాటు.. మరెన్నో కన్జ్యూమర్ ఉత్పత్తుల్ని ఉత్పత్తి చేస్తుందన్నవిషయం తెలిసిందే. సబ్బులు.. ట్యూబ్ లైట్లు మొదలు బేబీకేర్ ఉత్పత్తులతో పాటు.. పలు వస్తువుల్ని ఉత్పత్తి చేస్తుంది. దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే ఒంటి సబ్బుల్లో ఒకటి సంతూర్. ఆ సబ్బును ఉత్పత్తి చేసేది విప్రోనే.

తాజాగా ఈ సంస్థ మూడు సబ్బుల బ్రాండ్లను సొంతం చేసుకుంది. జో.. డోయ్.. బాక్టీర్ షీల్డ్ పేరుతో ఉన్న మూడు బ్రాండ్లను తన సొంతం చేసుకుంది. ఇప్పటికే ఉన్న వ్యాపారాల్ని మరింత విస్తరించుకునే క్రమంలో ఈ డీల్ ను పూర్తి చేసినట్లుగా చెబుతున్నారు. విప్రో కన్జూమర్ కేర్ అండ్ లైటింగ్ సంస్థను మరింత విస్తరిస్తోంది విప్రో.

ఈ మూడు సబ్బుల బ్రాండ్లను "వీవీఎఫ్ ఇండియా" నుంచి కొనుగోలు చేసింది. అయితే.. ఈ డీల్ ఎంతకు తెగిందన్న విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. గడిచిన ఏడాది కాలంలో మూడు కంపెనీల్ని కొనుగోలు చేసిన విప్రో.. తాజా కొనుగోళ్లతో మొత్తం 15కు చేరినట్లుగా చెబుతున్నారు. తాజాగా సొంతం చేసుకున్న మూడు సబ్బుల బ్రాండ్లు గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.210కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.

ఇక.. విప్రో ఫేమస్ బ్రాండ్ అయినా సంతూర్.. ఏడాదిలో రూ.2650కోట్ల అమ్మకాల్ని సాధించింది. ఫుడ్ మార్కెట్లోకి ప్రవేశించిన ఈ సంస్థ ఇప్పటికే నిరప్పర.. బ్రాహ్మిణ్స్ బ్రాండ్లను సొంతంచేసుకోవటం తెలిసిందే. తాజాగా సొంతం చేసుకున్న మూడు సబ్బుల బ్రాండ్ల డీల్ విలువ ఎంతన్న విషయాన్ని మాత్రంఅధికారికంగా వెల్లడించకపోవటం గమనార్హం.