Begin typing your search above and press return to search.

ఎన్నికల్లో ఏడిపించిన ఉల్లి, పత్తి, సోయాబీన్ !

‘‘నాసిక్ ప్రాంతంలో ఉల్లిగడ్డ, మరఠ్వాడాలో సోయాబీన్, విదర్భ ప్రాంతంలో పత్తి పంటలు మమ్మల్ని ఏడిపించాయ్.

By:  Tupaki Desk   |   12 Jun 2024 3:52 AM GMT
ఎన్నికల్లో ఏడిపించిన ఉల్లి, పత్తి, సోయాబీన్ !
X

‘‘నాసిక్ ప్రాంతంలో ఉల్లిగడ్డ, మరఠ్వాడాలో సోయాబీన్, విదర్భ ప్రాంతంలో పత్తి పంటలు మమ్మల్ని ఏడిపించాయ్. ఎన్నికల ఫలితాలలో అవే మమ్మల్ని దెబ్బతీశాయ్. కేంద్రంలో నూతన వ్యవసాయ శాఖా మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను కలుస్తా. ఈ పంటలకు మద్దతు ధర కోరుతా. రాష్ట్రంలో వ్యవసాయ సమస్యలపై ఇప్పటికే ప్రధాని నరేంద్రమోడీకి ఒక నివేదిక ఇచ్చాను’’ అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే అన్నారు.

బీజేపీ, శివసేన, ఎన్సీపీలతో కూడిన కూటమి మహారాష్ట్రలో ఈ సారి ఘోరంగా దెబ్బతిన్నది. 48 స్థానాలకు గాను కేవలం 17 స్థానాలకు పరిమితం అయింది. కాంగ్రెస్ 13 స్థానాలు, శివసేన థాకరే వర్గం 9 స్థానాలు, ఎన్సీపీ శరద్ పవార్ వర్గం 8 స్థానాలు, ఇండిపెండెంట్ అభ్యర్థి 1 స్థానం గెలుచుకున్నారు.

దేశంలో ఉల్లి ధరలను అదుపులో ఉంచేందుకు గత ఏడాది కేంద్రం ఉల్లి ఎగుమతులను నిషేధించింది. ఈ నిర్ణయం ఉల్లి రైతులకు తీవ్ర నష్టం చేకూర్చింది. ఇక స్థానికంగా మద్దతుధర ఇచ్చి కొనుగోలు చేస్తామని చెప్పి కేంద్రం మాట తప్పింది. నాసిక్ ప్రాంతం ఉల్లికి ప్రసిద్ది. దీంతో ఆ ప్రాంతంలో శివసేన ఓడిపోయింది. ఇక విధర్భ, మరఠ్వాడాలలో సోయాబీన్, పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో వారు ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన థాకరే కూటమి వైపు మొగ్గు చూపారు.