Begin typing your search above and press return to search.

మహిళలు, రైతులు మెచ్చిన సీఎం... అంచనాలకు దగ్గరగా కొత్త సర్వే!

అవును... తాజాగా ఏపీలో ఒక సర్వే విడుదలైంది. ఈ సందర్భంగా... ఈ సర్వే ఎప్పుడు, ఎలా, ఎంతమందిని, ఏయే అంశాలపై, ఏయే వర్గాలపై చేశారనేది సవివరంగా వివరించడం జరిగింది.

By:  Tupaki Desk   |   1 Feb 2024 4:58 PM GMT
మహిళలు, రైతులు మెచ్చిన సీఎం...  అంచనాలకు దగ్గరగా కొత్త సర్వే!
X

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టాయి. ఇదే సమయంలో పలు సంస్థల సర్వే ఫలితాలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా "ఎలక్ సెన్స్" అనే సంస్థ 2024 ఎన్నికలకు సంబంధించి సర్వే ఫలితాలు వెల్లడించింది. అత్యంత సూక్షంగా.. డోర్ టూ డోర్ చేపట్టినట్లు చెబుతున్న ఈ సర్వే ఫలితాలు ఆసక్తిగా మారాయి.

అవును... తాజాగా ఏపీలో ఒక సర్వే విడుదలైంది. ఈ సందర్భంగా... ఈ సర్వే ఎప్పుడు, ఎలా, ఎంతమందిని, ఏయే అంశాలపై, ఏయే వర్గాలపై చేశారనేది సవివరంగా వివరించడం జరిగింది. ఇందులో భాగంగా... 2023 డిశెంబర్ 1 నుంచి 2024 జనవరి 12 వరకూ ఈ సర్వే జరిగినట్లు సంస్థ వెల్లడించింది. ఈ క్రమంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ 88,700 శాంపిల్స్ ని సేకరించినట్లు తెలిపింది. ఈ వివరాలను క్రోడీకరించి ఫలితాలను సవివరంగా వెల్లడించింది.

ఈ సర్వే శాంపిల్స్ సేకరణలో భాగంగా ఓటరును నేరుగా కలుసుకోవడం, డోర్ టు డోర్ టచ్ చేసి అభిప్రాయాలు తీసుకోవడం చేసినట్లు తెలిపింది ఈ సంస్థ. ఈ సందర్భంగా ఓటర్లకు సంధించిన ప్రశ్నలను వెల్లడించారు. ఇందులో భాగంగా...

1. ప్రస్తుత, గత ముఖ్యమంత్రి పనితీరు

2. సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు

3. టీడీపీ - జనసేన కూటమి

4. రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ, కోవిడ్ మహమ్మారి నిర్వహణ

5. ఉపాధి, ఆర్థిక అవకాశాలు

6. ఇసుక, మద్యం విధానం

7. ఎమ్మెల్యే సంతృప్తి

8. స్కిల్ స్కాం కేసులో మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్

9. మూడు రాజధానుల అంశం

ఈ సందర్భంగా వెళ్లడించిన సర్వేల ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి!

వైఎస్సార్సీపీ - 122 (+/-10)

టీడీపీ + జనసేన - 53 (+/-10)

బీజేపీ - 0

కాంగ్రెస్ - 0

ఇతరులు - 0

ఇదే సమయలో ఓట్ల షేర్ విషయానికొస్తే...

వైఎస్సార్సీపీ - 49.14%

టీడీపీ + జనసేన - 44.34%

బీజేపీ - 0.56%

కాంగ్రెస్ - 1.21%

ఇతరులు - 4.75%

ఈ సమయంలో వివిధ వర్గాలు, వృత్తుల వారీగా ముఖ్యమంత్రి పనితీరుపై ప్రజల అభిప్రాయాలనూ ఈ సర్వే వెల్లడించింది. ఇందులో భాగంగా... ప్రధానంగా రోజువారీ కూలీలు, ప్రభుత్వ - ప్రైవేటు ఉద్యోగులు, రైతులు, గృహిణులు, చిరు వ్యాపారులు, విద్యార్థులు, ఇతరులు అనే కేటగిరీలుగా విభజిస్తూ అభిప్రాయ సేకరణ చేపట్టారు.

ఈ సమయంలో... రోజువారీ కూలీలు, ప్రభుత్వ - ప్రైవేటు ఉద్యోగులు, రైతులు, గృహిణులు, చిరు వ్యాపారులు 50 శాతానికి పైగా ముఖ్యమంత్రి జగన్ పనితీరుపై సంతృప్తిని ప్రకటించగా... వీరిలో అత్యధికంగా గృహిణులు 58.3% జగన్ పరిపాలనపై సంతృప్తిని ప్రకటించారు. అనంతరం రోజువారీ కూలీలు (56.6%), రైతులు (53.3%), చిరు వ్యాపారులు (52.9%) ముఖ్యమంత్రి పనితీరుపై సంతృప్తిని వ్యక్తం చేశారు.

ఇక జెండర్ వారీగా ఓటర్ల అభిప్రాయాలను పరిశీలిస్తే...

వైఎస్సార్సీపీ - 54.77% మహిళలు - 45.68% పురుషులు

టీడీపీ + జనసేన - 41.12% మహిళలు - 49.67% పురుషులు

బీజేపీ - 0.32% మహిళలు - 0.49% పురుషులు

కాంగ్రెస్ - 0.66% మహిళలు - 0.73% పురుషులు

ఇతరులకు - 3.132% మహిళలు - 3.43% పురుషులు... బలపరుస్తున్నారు.

ఇదే సమయంలో వయసుల వారీగా ఓటర్ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటే... 18 నుంచి 30 సంవత్సరాలలోపు వారు అధికార వైసీపీకి 43.04% బలపరుస్తుండగా... 30 - 45 శాతంవారు 50.72% మంది, 45 - 60 మధ్య వయసుగలవారు 55.00% మంది వైసీపీని బలపరుస్తున్నారు. ఇక అత్యధికంగా 57.07% మంది పెన్షన్ లబ్ధిదారులు జగన్ కు జై కొడుతున్నారు.

ఇదే క్రమంలో జిల్లాల వారిగా ఈ సర్వే ఫలితాలు వెల్లడిస్తున్న వివరాలను పరిశీలిస్తే... విశాఖ, తూర్పూగోదావరి మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ వైసీపీ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక విజయనగరం, కడప, కర్నూల్ అయితే క్లీన్ స్వీప్ దిశగా ఫ్యాన్ గిరా గిరా తిరుగుతుందని ఈ సర్వే ఫలితాలు చెబుతున్నాయి! ఇక చంద్రబాబు సొంతజిల్లాలోని 14 స్థానాల్లోనూ 12స్థానాలు వైసీపీ ఖాతాలో పడతాయని సర్వే చెబుతుంది. ఈ క్రమంలో ఏ జిల్లాలో ఎవరి పరిస్థితి ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం...!

శ్రీకాకుళం (10) - వైసీపీ (7); టీడీపీ+జనసేన (2); హోరాహోరీ (1)

విజయనగరం (9) - వైసీపీ (8); టీడీపీ+జనసేన (0); హోరాహోరీ (1)

విశాఖపట్నం (15) - వైసీపీ (4); టీడీపీ+జనసేన (10); హోరాహోరీ (1)

తూర్పు గోదావరి (19) - వైసీపీ (7); టీడీపీ+జనసేన (9); హోరాహోరీ (3)

పశ్చిమ గోదావరి (15) - వైసీపీ (8); టీడీపీ+జనసేన (3); హోరాహోరీ (4)

కృష్ణా (16) - వైసీపీ (9); టీడీపీ+జనసేన (5); హోరాహోరీ (2)

గుంటూరు (17) - వైసీపీ (11); టీడీపీ+జనసేన (3); హోరాహోరీ (3)

ప్రకాశం (12) - వైసీపీ (8); టీడీపీ+జనసేన (2); హోరాహోరీ (2)

నెల్లూరు (10) - వైసీపీ (8); టీడీపీ+జనసేన (2); హోరాహోరీ (2)

చిత్తూరు (14) - వైసీపీ (12); టీడీపీ+జనసేన (2); హోరాహోరీ (0)

కడప (10) - వైసీపీ (10); టీడీపీ+జనసేన (0); హోరాహోరీ (0)

కర్నూల్ (14) - వైసీపీ (12); టీడీపీ+జనసేన (0); హోరాహోరీ (2)

అనంతపురం (14) - వైసీపీ (8); టీడీపీ+జనసేన (2); హోరాహోరీ (4)

వైసీపీకి బలంగా మారిన ప్రధాన అంశాలు!!

ఈ సంస్థ వెల్లడించిన ప్రకారం వైఎస్సార్సీపీకి ఈ స్థాయిలో ప్రజలు క్లియర్ మెజారిటీ ఇచ్చేలా సర్వే ఫలితాలు రావడానికి పలు బలమైన కారణాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇందులో భాగంగా ... సంక్షేమ పథకాలు అన్ని నేరుగా లద్భిదారులకు చేరడం ప్రధాన పాజిటివ్ అంశంగా కనిపిస్తుంది. ఇదే సమయంలో పెన్షన్, రేషన్ డోర్ డెలివరీతో సీనియర్ సిటిజన్లు చాలా సంతోషంగా ఉన్నారని తెలుస్తుంది. అదేవిధంగా.. చెప్పిన మాటకు కట్టుబడి క్రమంగా పెన్షన్ మొత్తాన్ని పెంచడం కుడా ప్లస్ అయ్యిందని అంటున్నారు.

ఇక పేద, మద్యతరగతి కుటుంబాల్లో విద్య & ఆరోగ్యం లపై జగన్ సర్కార్ చూపించిన కమిట్మెంట్ సానుకూల అంశంగా వినబడుతుందని చెబుతున్నారు. ఇందులో ప్రధానంగా... విద్య (నాడు - నేడు, ఇంగ్లిష్ మీడియం), ఆరోగ్యం (104,108, నాడు - నేడూ, ఆరోగ్యశ్రీ కింద విధానాల పెంపు) వంటి అంశాలు కీలక భూమిక పోషిస్తున్నాయని అంటున్నారు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు జగన్ సర్కార్ అన్ని విషయాల్లోనూ ఇచ్చిన ప్రధాన్యత కూడా ఈ ఫలితాలకు ప్రధాన కారణం అని అంటున్నారు.