Begin typing your search above and press return to search.

రైతుబంధు నిజమైన పరీక్షేనా ?

కేసీయార్ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల కమిషన్ నిజమైన పరీక్ష పెట్టినట్లుంది. ఎలాగంటే చివరి నిముషంలో రైతుబంధు పథకం అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

By:  Tupaki Desk   |   25 Nov 2023 5:29 AM GMT
రైతుబంధు నిజమైన పరీక్షేనా ?
X

కేసీయార్ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల కమిషన్ నిజమైన పరీక్ష పెట్టినట్లుంది. ఎలాగంటే చివరి నిముషంలో రైతుబంధు పథకం అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చివరి నిముషంలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వటమే ఇబ్బందిగా మారిందంటే అందుకు షరతులను పెట్టి ఆమోదించటం మరింత ఇబ్బందిగా మారింది. రైతుబంధు పథకం అమలుకు అనుమతించాలని నవంబర్ రెండో వారంలోనే ప్రభుత్వం ఎన్నికల కమీషన్ను కోరింది. అయితే ఎప్పటిలోగా పథకాన్ని అమలు చేస్తారో చెప్పమని కమీషన్ అడిగింది. దీనికి ప్రభుత్వం ఎలాంటి సమాధానం చెప్పలేదు.

అయితే తర్వాత ఏమైందో ఏమో సడెన్ గా శుక్రవారం రాత్రి రైతుబంధు అమలుకు కమీషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో ప్రభుత్వం ఒకరకంగా హ్యాపీగా ఫీలైంది. ఎందుకంటే ఎన్నికలకు ముందు పథకం అమలుకు ఒప్పుకోవటం అంటే రైతుల ఖాతాల్లో డబ్బులు వేయచ్చు కదాని. అయితే అనుమతితో పాటు పెట్టిన షరతును చూసేటప్పటికి కేసీయార్ ప్రభుత్వం చాలా ఇబ్బందులు పడుతోంది. ఇంతకీ ఆ షరతు ఏమిటంటే పథకంలో డబ్బులను కచ్చితంగా 28వ తేదీ సాయంత్రంలోగా పూర్తి చేయాలని.

28వ తేదీ సాయంత్రానికి పార్టీల ప్రచారం ముగుస్తుంది. 29న సైలెన్స్ పీరియడ్, 30వ తేదీన పోలింగ్. కాబట్టి 28 సాయంత్రంలోగా రైతుల ఖాతాల్లో డబ్బులు వేసేయాలని చెప్పింది. ఇక్కడే పెద్ద చికొచ్చిపడింది. అదేమిటంటే 24 రాత్రి డబ్బులు వేయటానికి అనుమతించింది. 25, 26, 27 తేదీలు బ్యాంకులకు సెలవులు. 25 చివరి శనివారం, 26వ తేదీ ఆదివారం, 27 గురునానక్ జయంతి జాతీయ సెలవుదినం. అంటే ఈ మూడు రోజులు బ్యాంకులు పనిచేయవు.

ప్రభుత్వం డబ్బులు వేయాలన్నా ప్రాబ్లమే ఒకవేళ ఏదో పద్దతిలో వేసినా ప్రాసెస్ అవదు. అంటే డబ్బులు రైతుల ఖాతాల్లో పడే అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి. మిగిలింది 28వ తేదీ మాత్రమే. 70 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయానికి ఉద్దేశించింది రైతుబంధు పథకం. ఈ మూడురోజులు సెలవులు కాబట్టి తర్వాత డబ్బులు వేసేందుకు లేదు. మూడురోజులు అయిపోతే డిసెంబర్ 3వ తేదీన రాజెవరో రెడ్డెవరో తేలిపోతుంది. అందుకనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే ఇచ్చి కేసీయార్ ప్రభుత్వానికి పెద్ద పరీక్షే పెట్టింది ఎన్నికల కమీషన్.