ఎన్నికల వేళ సంక్షేమ పథకాల లబ్ధిదారులతో చంద్రబాబు చెలగాటం!?
అవును... ఏపీలో సంక్షేమ పథకాల లబ్ధిదారులకు హైకోర్టు గుడ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 10 May 2024 9:06 AM GMTఏపీలో జగన్ సర్కార్ అందిస్తున్న సంక్షేమ పధకాలను నిలిపేస్తూ ఉత్తర్వ్యులు జారీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి.. లబ్దిదారులకు నిధులు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఊరటని ఇస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ సమయంలో మరో సమస్య లబ్ధిదారుల పాలిట శాపంగా మారింది. ఆ సమస్యకు కారణం టీడీపీ అంటూ వైసీపీ దుమ్మెత్తిపోస్తుంది!
అవును... ఏపీలో సంక్షేమ పథకాల లబ్ధిదారులకు హైకోర్టు గుడ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... మే 10వ తేదీ ఒక్క రోజు మాత్రమే గడువు పెట్టి.. ఈ ఒక్క రోజులోగా పధకాలకు నిధులు విడుదల చేయాలని ఆదేశించింది. ఇదే సమయంలో... ఏ హంగూ ఆర్భాటాలు లేకుండా పని పూర్తి చేయాలని సూచించింది. ఈ మేరకు గురువారం రాత్రి హైకోర్టు తీర్పు ఇచ్చింది.
దీంతో... ఈ వ్యవహారంపై క్లారిటీ కోసం అధికారులు ఈసీని సంప్రదించారు. అయితే శుక్రవారం మధ్యాహం వరకూ కూడా ఈసీ నుంచి క్లారిఫికేషన్ రాలేదు అని తెలుస్తోంది. ఇక మిగిలింది కొన్ని గంటలు మాత్రమే కావడంతో ఈ విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ విషయంలో ఈసీ నిర్ణయం ప్రకటించడంలో ఆలస్యం అయితే మాత్రం హైకోర్టు తీర్పు ద్వారా లభించిన ఊరట.. లబ్దిదారులకు దక్కకుండా పోతుంది అని అంటున్నారు.
మరోపక్క... హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మీద ఎన్నికల కమిషన్ క్లారిటీ ఇవ్వకపోతే తాము ఏ విధంగానూ ముందుకు వెళ్ళలేమని అధికారులు అంటున్నారని తెలుస్తుంది. దీంతో జగన్ బటన్ నొక్కి విడుదల చేసిన డబ్బులు తమ ఖాతాల్లో జమ అవుతాయో లేదో అని లబ్ధిదారులు టెన్షన్ గా ఎదురుచూస్తున్నారు!
మరోవైపు జగన్ తమ ప్రభుత్వానికి ప్రజలు అరవై నెలల పాటు పాలించే అధికారం ఇచ్చినా కూడా 57 నెలలకే తన అధికారాలను తీసుకుని.. ప్రభుత్వం పీక నొక్కే కార్యక్రమాన్ని విపక్షాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఇది తన పీక నొక్కడం కాదని పేదల పీక నొక్కడమేనని ఆయన నిప్పులు చెరిగారు. తాను ఎన్నికలను ఉద్దేశించి పథకాలను ప్రకటించలేదని.. అయిదేళ్ళ పాటు సంక్షేమ క్యాలెండర్ ని అమలు చేస్తూనే ఉన్నామని స్పష్టం చేశారు.
ఈ సమయంలో... హైకోర్టు ఉత్తర్వులను అడ్డుకునేందుకు మరోవైపు కోర్టులో టీడీపీ ప్రయత్నాలు చేస్తోందంటూ వైసీపీ ఆరోపిస్తుంది. ఇందులో భాగంగా... నవతరం పార్టీ తరఫున పరోక్షంగా కోర్టులో అప్పీల్ వేసిందంటూ మండిపడుతుంది. ఇప్పుడు ఈ విషయం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. పైగా... తమకు ఫిర్యాదులు వచ్చినందునే పథకాలను నిలిపేశామని ఈసీ పేర్కొందని చెబుతుండటంతో... ఇదంతా విపక్షాల బాగోతమే అంటూ మండిపడుతున్నారు వైసీపీ నేతలు!