Begin typing your search above and press return to search.

గాజు గ్లాస్ గుర్తు : ఈసీ ఫైనల్ డెసిషన్ ఇదే !

ఈ దశలో గాజు గ్లాస్ గుర్తుని ఇండిపెండెంట్ల వద్ద నుంచి తీసుకుని కొత్త గుర్తులు మార్చలేమని ఈసీ తరఫున న్యాయవాది హై కోర్టుకు స్పష్టం చేశారు.

By:  Tupaki Desk   |   2 May 2024 3:52 PM GMT
గాజు గ్లాస్ గుర్తు : ఈసీ ఫైనల్ డెసిషన్ ఇదే !
X

ఏపీలో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం అయిపోయింది. ఇండిపెండెంట్లకు కొందరికి గాజు గ్లాస్ గుర్తు ఇప్పటికే ఇచ్చేశామని, మరో వైపు పోలింగ్ కి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని హై కోర్టుకు కేంద్ర ఎన్నికల సంఘం తెలియచేసింది. ఈ దశలో గాజు గ్లాస్ గుర్తుని ఇండిపెండెంట్ల వద్ద నుంచి తీసుకుని కొత్త గుర్తులు మార్చలేమని ఈసీ తరఫున న్యాయవాది హై కోర్టుకు స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే టీడీపీ తరఫున న్యాయవాది మాట్లాడుతూ ప్రీ పోల్ అలయెన్స్ ని టీడీపీ బీజేపీ కలసి జనసేనతో కుదుర్చుకున్నాయని,అందువల్ల గుర్తులు వేరే వారికి ఇస్తే గందరగోళం ఏర్పడుతుందని కూటమి రాజకీయ ప్రయోజనాలు దెబ్బ తింటాయన్న దాని మీద ఈసీ అయితే ఏమీ చేయలేమని చెప్పేసింది. అంతే కాదు టీడీపీ వేసిన పిటిషన్ కి అర్హత కూడా లేదని వాదించింది.

ఇలాంటి పిటిషన్లు ఇంకా వస్తూనే ఉంటాయని ఎన్నికల ప్రక్రియ పోలింగ్ ప్రకియకు కౌంట్ డౌన్ మొదలైన వేళ ఈ వివాదం ఇంతటితో ముగించాలన్న అభిప్రాయాన్ని కూడా ఈసీ వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇండిపెండెంట్ అభ్యర్ధులకు ఎవరెవరికి ఈసీ గాజు గ్లాస్ గుర్తు ఇచ్చిందో వివరాలు అందించాలని హై కోర్టు కోరినట్లుగా చెబుతున్నారు. వాటిని సమర్పించేందుకు ఈసీ అంగీకారం తెలిపింది.

రెండు వైపుల నుంచి వాదనలు విన్న మీద ఈ విచారణను సోమవారానికి అంటే ఈ నెల 6వ తేదీకి హై కోర్టు వాయిదా వేసింది. ఇదిలా ఉంటే ఈసీ ఈ దశలో ఇండిపెండెంట్లకు ఇచ్చిన గుర్తులను మార్చలేమని చెప్పడమే కాదు పోలింగ్ ప్రక్రియ మొదలైంది అని చెబుతోంది. అంతే కాదు ఈవీఎం లలో ఆయా నియోజకవర్గాల వారీగా పోటీ చేస్తున్న అభ్యర్ధులు వారి గుర్తులతో అన్ని వివరాలు రెడీ చేసి కూడా ఉంచారు.

దాంతో ఇండిపెండెంట్ల గుర్తుని మార్చడం అన్నది అసలు కుదరదు అని చెప్పడంతో జనసేన కంటే టీడీపీ కూటమికే భారీ షాక్ తగిలింది అని అంటున్నారు. జనసేన పిటిషన్ మీద ఈసీ సానుకూలత వ్యక్తం చేస్తూ ఆ పార్టీ పోటీ చేసే చోట్ల గాజు గ్లాస్ గుర్తుని ఇండిపెండెంట్లకు ఇవ్వకుండా నిలుపుదల చేసింది

కానీ మొత్తం కూటమి ప్రయోజనాలు నెరవేరాలన్నది ఉద్దేశ్యం. పోటీ చేయని చోట్ల ఇండిపెండెంట్లకు గాజు గ్లాస్ గుర్తు ఇస్తే కనుక వారు ఓట్లు భారీ ఎత్తున చీలుస్తారు అన్నదే కూటమి ఆందోళన. ఈసీ తన ఫైనల్ డెసిషన్ ఇదే అని చెప్పడంతో ఇపుడు కూటమికి ఓట్ల చీలిక కలవరపెడుతోంది అని అంటున్నారు. దీని మీద ఏమి చేస్తారు అన్నది కూడా చూడాల్సి ఉంది. ఏమీ చేసినా ఇదే ఫైనల్ కాబట్టి ఈసారికి ఇంతే అని భావించి ఇండిపెండెంట్లు ఓట్లు చీల్చకుండా కొత్త వ్యూహాలతోనే ముందుకు రావాల్సి ఉంది అని అంటున్నారు.