Begin typing your search above and press return to search.

ముహూర్తం ఎఫెక్ట్... పోలింగ్ తేదీ మార్చిన ఎన్నికల కమిషన్!

నవంబర్ 25వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తామని తాజాగా ప్రకటించింది. దీంతో... ఎన్నికలు రెండు రోజులు పోస్ట్ పోన్ అయ్యయన్నమాట.

By:  Tupaki Desk   |   11 Oct 2023 12:19 PM GMT
ముహూర్తం ఎఫెక్ట్... పోలింగ్  తేదీ మార్చిన ఎన్నికల కమిషన్!
X

దేశంలో అత్యంత కీలకంగా, సెమీ ఫైనల్ గా భావిస్తోన్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ సోమవారం షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... తెలంగాణతో సహా రాజస్థాన్, మిజోరాం, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ రాష్ట్రాలలో పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యలో పోలింగ్ తేదీని మారుస్తూ ఎన్నికల కమిషన్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.


అవును... నవంబర్ 23న రాజస్థాన్ లో అసెంబ్లీ ఎన్నికలకు డెట్ ఫిక్స్ చేసింది ఎన్నికల కమిషన్. అయితే ముహూర్తం పరంగా అది చాలా మాంచిరోజు అవ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా కనీవినీ ఎరుగని రీతిలో సుమారు 50వేళ పెళ్లిళ్లు ఉన్నాయని కథనాలొచ్చాయి. 50వేళ పెళ్లిళ్లు అంటే... సుమారు రాష్ట్రవ్యాప్తంగా 20లక్షల మందీ ఆ రోజు బిజీ అయిపోతారని, ఫలితంగా ఓటింగ్ శాతం విపరీతంగా పడిపోయే ప్రమాదం ఉందని కథనాలొచ్చాయి.

ఇదే సమయంలో... అదేరోజున ఖాతు శ్యాం జీ జాతర కూడా ఉందట. అది కూడా ముఖ్యమైన వేడుక అని అంటున్నారు. జాతరకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది పాల్గొంటారని చెబుతున్నారు. దీని ప్రభావం కూడా ఓటింగ్ శాతంపై పడుతుందా అనే ప్రశ్న తలెత్తుతోందని అంటున్నారు. దీంతో ఇలాంటి కథనాలు వచ్చిన మరుసటి రోజే ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా పోలింగ్ తేదీని మారించింది.

అవును... రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల తేదీని కేంద్ర ఎన్నికల సంఘం మార్చింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 23న ఎన్నికలు జరగాల్సి ఉండగా... నవంబర్ 25వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తామని తాజాగా ప్రకటించింది. దీంతో... ఎన్నికలు రెండు రోజులు పోస్ట్ పోన్ అయ్యయన్నమాట.

కాగా.. దేవుత్తని ఏకాదశి పవిత్ర సమయం నవంబర్ 23 కావడంతో... ఆ రోజున రాజస్థాన్ రాష్ట్రంలో 50 వేలకు పైగా వివాహాలు జరిగే అవకాశం ఉందని కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో... ఖాతు శ్యాం జీ జాతర కూడా ఉందని... దీనికోసం రాజస్థాన్ రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా, దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది పాల్గొంటారని అన్నారు.

దీంతో ఈ రెండింటి ప్రభావం ఓటింగ్ శాతంపై భారీగా పడుతుందనే కామెంట్ బలంగా వినిపించింది. దీంతో... ఎన్నికల కమిషన్ నవంబర్ 23కి బదులు నవంబర్ 25కి పోలింగ్ తేదీని పోస్ట్ పోన్ చేస్తూ ప్రకటన వెలువరించింది.