రేవంత్ రెడ్డి కేబినెట్ మీటింగ్‌కు ఈసీ కండిషన్లు.. రీజనేంటి?
తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ సమావేశం నిర్వహించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది
By: Tupaki Desk | 20 May 2024 3:42 AM GMTతెలంగాణ ప్రభుత్వం కేబినెట్ సమావేశం నిర్వహించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాస్తవానికి ఈ నెల 13నే తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు ముగిసిపోయాయి. దీంతో అప్పటి నుంచి కూడా.. కేబినెట్ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ భావించారు. కానీ, ఎన్నికల కోడ్ దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న నేపథ్యంలో ఆయనకు ప్రతిబంధకం ఏర్పడింది. ప్రస్తుతం ఉన్న సమస్యలతోపాటు.. కీలకమైన అంశాలపై చర్చించాలని రేవంత్ భావించారు.
కానీ.. ఎన్నికల సంఘం అనుమతి తప్పని సరికావడంతో వేచి చూశారు. ఇక, అనుమతి విషయంలో కేం ద్ర ఎన్నికల సంఘం కీలకమైన షరతులు పెట్టింది. ఎట్టకేలకు సమావేశం నిర్వహించుకునేందుకు అనుమతి లభించినా.. ఈసీ షరతులతో మాత్రం సీఎం ఒకింత డీలా పడినట్టు తెలుస్తోంది. వాస్తవానికి జూన్ 5వ తేదీ వరకు కూడా.. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. కానీ, జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించాలని.. రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ క్రమంలోనే ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ విషయంపై కేబినెట్‌లో చర్చించాలని అనుకు న్నారు. అదేవిధంగా ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను కూడా.. చర్చించి.. వెంటనే షార్ప్ నిర్ణ యాలు తీసుకోవాలని నిర్ణయించారు. అలానే రైతు రుణ మాఫీ విషయాన్ని కూడా ఏదో ఒకటి తేల్చేయా లని సీఎం రేవంత్ భావించారు. కానీ, చిత్రంగా..ఈ విషయాలపైనే ఈసీ అడ్డుకట్ట వేసింది. రైతు రుణ మాఫీ, ఏపీ విభజన చట్టంలోని అంశాలను, ఉమ్మడి రాజధాని అంశాలను కూడా.. చర్చించరాదని పేర్కొన్నది.
రీజనేంటి?
కేబినెట్ మీటింగ్ జరిపి.. నిర్ణయాలు వెలువరిస్తే.. ఒకటి.. పొరుగున ఉన్న ఏపీలో అలజడి రేగే అవకాశం ఉంటుందని.. ప్రస్తుతం తమ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో అల్లర్లు చెలరేగితే.. అదుపు చేయడం కష్టమ ని ఈసీ భావించి ఉండాలి. లేదా.. ఇరు రాష్ట్రాల్లోనూ ఉమ్మడి రాజధాని అంశం.. చిచ్చు రేపుతుందని అంచనా వేసి ఉండొచ్చు. ఇక, రైతు రుణమాఫీపై చర్చించకుండా అడ్డుకట్ట వేయడం ద్వారా.. ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న ఎన్నికలు ప్రభావితం కాకుండా..(ఎందుకంటే.. జాతీయ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం కనుక) ఉండే ఉద్దేశం ఉండి ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. మొత్తానికి జూన్ 4వ తేదీలో పు వర్తించే కార్యక్రమాలకు సంబంధించిన అంశాలపైనే చర్చించేందుకు ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడం గమనార్హం. మరి సీఎం రేవంత్ ఏం చేస్తారో చూడాలి.