Begin typing your search above and press return to search.

ఎన్నికల కమీషన్ సీరియస్ గా ఉందా ?

ఎన్నికల ప్రక్రియ జరుగుతున్న విధానంపై కేంద్ర ఎన్నికల కమీషన్ చాలా సీరియస్ గా ఉన్నట్లు సమాచారం.

By:  Tupaki Desk   |   13 Nov 2023 4:30 PM GMT
ఎన్నికల కమీషన్ సీరియస్ గా ఉందా ?
X

ఎన్నికల ప్రక్రియ జరుగుతున్న విధానంపై కేంద్ర ఎన్నికల కమీషన్ చాలా సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. కారణం ఏమిటంటే అన్ని పార్టీలు యధేచ్చగా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించటమే. ఎన్నికల నిబంధనలపై పోలీసులు ఇప్పటికి 450 ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారంటేనే ఉల్లంఘనలు ఎంత ఎక్కువగా జరిగాయో అర్ధమైపోతోంది. ఒకవైపు నిబంధలను ఉల్లంఘిస్తున్నారు మరోవైపు తాయిలాల పంపకాలు కూడా జరిగిపోతున్నాయి. దీంతోనే పోలీసింగ్ ఎంత వీకుగా జరుగుతోందో అర్ధమైపోతోంది.

శుక్రవారం నాటికే అన్నీ పార్టీల నుండి పంపిణీలో ఉన్న సుమారు రు. 550 కోట్ల విలువైన తాయిలాలను పట్టుకున్నారు. ఇందులో డబ్బే సుమారు రు. 200 కోట్లుంటుంది. ఇక బంగారం, వజ్రాలు, ఖరీదైన వస్తువులు, టీవీలు, కుక్కర్లు, లిక్కర్ బాటిళ్ళే కాకుండా కొత్తగా మాదకద్రవ్యాలు కూడా రవాణా అవుతున్నాయి. గతంలో బంగారం, వజ్రాలు, లిక్కర్ బాటిళ్ళు, మాదక ద్రవ్యాలు రవాణా అయ్యేవి కావు. ఎక్కడో గుట్టుచప్పుకాకుండా అందాల్సిన వాళ్ళకు అందేదంతే. కానీ ఇపుడు ప్రత్యేకంగా రవాణా కూడా చేసేస్తున్నారు.

తాయిలాలు పంపిణీ జరుగుతున్నాయన్నా, 450 ఎఫ్ ఐ ఆర్లు నమోదయ్యాయన్నా నిబంధనలను అన్నీ పార్టీలు ఎంతగా ఉల్లంఘిస్తున్నాయో అర్ధమైపోతోంది. ఎన్నికల్లో గెలుపు మాత్రమే అన్ని పార్టీలు టార్గెట్ పెట్టుకోవటంతో ఎన్నికల నిబంధనలను ఏ పార్టీ కూడా పట్టించుకోవటంలేదు. ఏ రెండుపార్టీలకూ ర్యాలీల కోసమని ఒకే రూటులో ఒకేసమయంలో అనుమతులు ఇవ్వద్దని కేంద్ర ఎన్నికల కమీషన్ చాలా స్పష్టంగా ఆదేశాలిచ్చింది. అయితే ఈ ఆదేశాలు కూడా అమలవ్వటంలేదు.

నామినేషన్ల సమయంలో కొన్ని పార్టీల మధ్య గొడవలవ్వటానికి ర్యాలీలు కూడా కారణమే. అలాగే ఎన్నికల్లో ప్రచారం చేసుకునేటపుడు ఏ రెండుపార్టీలకు ఒకే సమయంలో ఒకే ఏరియాలో అనుమతులు ఇవ్వకూడదని కూడా ఆదేశాలున్నాయి. వీటిని పోలీసు అధికారులకు కూడా ఎన్నికల కమీషన్ అందించింది. ఇలాంటి నిబంధనలన్నింటినీ కలెక్టర్లు, ఎస్పీలు, అడిషినల్ ఎస్పీ, డీఎస్పీ, ఆర్డీవోలు, ఎంఆర్వోలతో కమీషన్ ప్రత్యేకంగా సమావేశాలు పెట్టి మరీ చెప్పింది. అయినా కొన్నిచోట్ల గొడవల్లయ్యాయంటేనే లా అండ్ ఆర్డర్ ఎంత బలహీనంగా పనిచేస్తోందో తెలిసిపోతోంది. ఇందుకనే కమీషన్ చాలా సీరియస్ గా ఉంది.