బ్రేకింగ్... ఏపీలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ లపై ఈసీ బదిలీ వేటు!
అవును... సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో... ఆంధ్రప్రదేశ్ లో పలువురు ఉన్నతాధికరులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది
By: Tupaki Desk | 2 April 2024 11:36 AM GMTసాధారణంగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ, ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న సమయలో పలువురు ఉనంతాధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేస్తుంటుంది. అందుకు గల కారణాలు ఏవనే విషయం సవివరంగా వెల్లడించకపోయినప్పటికీ.. వారి కారణాలు వారికి ఉంటాయని అంటుంటారు! ఈ క్రమంలోనే ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల సంఘం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
అవును... సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో... ఆంధ్రప్రదేశ్ లో పలువురు ఉన్నతాధికరులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ఇందులో భాగంగా... ముగ్గురు ఐఏఎస్ లతో పాటు ఆరుగురు ఐపీఎస్ లను ట్రాన్స్ ఫర్ చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీకి.. ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాశ్ కుమార్ ఒక లేఖ రాశారు.
ఇందులో భాగంగా... ముగ్గురు జిల్లా ఎన్నికల అధికారులు (డీఈఓ), ఐదుగురు సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ), ఒక ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీ) ని బదిలీ చేస్తున్నట్లు ఈ లేఖలో పేర్కొన్నారు. ఇదే సమయంలో... బదిలీ అయిన వరికి 2024 సార్వత్రిక ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
అదే విధంగా... బదిలీ అయిన వారి స్థానంలో కొత్తవారి భర్తీకి ముగ్గురు ఆఫీసర్లతో ప్యానల్ పంపాలని తెలిపారు! మరోపక్క ఏపీలో ఎన్నికల నిర్వహణ కోసం అబ్జర్వర్లను నియమించింది కేంద్ర ఎన్నికల కమిషన్. ఇందులో భాగంగా... జనరల్ స్పెషల్ అబ్జర్వర్ గా రిటైర్డ్ ఐఏఎస్ రాం మోహన్ మిశ్రా.. పోలీస్ స్పెషల్ అబ్జర్వర్ గా రిటైర్డ్ ఐపీఎస్ దీప మిశ్రాలను నియమించింది.
బదిలీ అయిన జిల్లా ఎన్నికల అధికారులు (డీఈఓ)!:
పి. రాజబాబు, ఐఏఎస్ - డీఈఓ, కృష్ణా
ఎం. గౌతమి, ఐఏఎస్ - డీఈఓ, అనంతపురం
డా. లక్ష్మీషా - డీఈఓ, తిరుపతి
బదిలీ అయిన సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ లు (ఎస్పీ)!:
పరమేశ్వర్, ఐపీఎస్ - ఎస్పీ, ప్రకాశం
రవిశంకర్ రెడ్డి, ఐపీఎస్ - ఎస్పీ, పల్నాడు
పి. జాషువా, ఐపీఎస్ - ఎస్పీ, చిత్తురు
కేకేఎన్ అన్బురాజన్, ఐపీఎస్ - ఎస్పీ, అనంతపురం
కే తిరుమలేశ్వర్, ఐపీఎస్ - ఎస్పీ, నెల్లూరు
బదిలీ అయిన ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీ)!:
జి. పాలరాజు, ఐపీఎస్ - ఐజీపీ, గుంటూరు రేంజ్