అమెరికాలోనూ ఎన్నికల విరాళాలు.. జోబైడెన్-ట్రంప్‌ల పోటాపోటీ
కానీ, అధ్యక్ష రేసులో ఉన్న ఇద్దరు నేతలు కూడా పోటా పోటీగా విరాళాలు సేకరిస్తన్నారు.
By: Tupaki Desk | 7 April 2024 5:49 PM GMTభారత దేశంలో `ఎలక్టోరల్ బాండ్స్` ద్వారా ఎన్నికల విరాళాలు సేకరించడం పెద్ద వివాదం గా మారిన విషయం తెలిసిందే. 2019లో ప్రవేశ పెట్టిన ఈ పథకం ద్వారా.. అన్ని పార్టీలూ లబ్ధి పొందాయి. అయితే.. అధికారంలో ఉన్న బీజేపీకి మూడింతలు ఎక్కువగా లబ్ది ఒనగూరింది. ఇక, అగ్రరాజ్యం అమెరికాలోనూ అధ్యక్ష ఎన్నికల(నవంబరులో జరుగుతాయి) ముందు.. ఇక్కడ కూడా ఎన్నికల విరాళాల వ్యవహారం కాక రేపుతోంది. అయితే..ఎలాంటివివాదం కాదు. కానీ, అధ్యక్ష రేసులో ఉన్న ఇద్దరు నేతలు కూడా పోటా పోటీగా విరాళాలు సేకరిస్తన్నారు.
అధ్యక్ష ఎన్నికల రేసులో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు, పొలిటికల్ ఫైర్ బ్రాండ్ డొనాల్డ్ ట్రంప్‌లు తలపడుతు న్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఒకరిని మించి ఒకరు ప్రచారంలోనే కాకుండా.. ఎన్నికల విరాళాలు సేకరించడంలోనూ దూసుకుపోతున్నారు. ఇప్పటి వరకు ఎవరికి వారుగా వెల్లడించిన వివరాల ప్రకారం.. జోబైడెన్.. ట్రంప్ కంటే దాదాపు రెండింత లు ఎక్కువగానే విరాళాలు సొంతం చేసుకున్నారు. ఇరువురూ వెల్లడించిన విరాళాల వివరాల ప్రకారం.. ఒక్క మార్చిలోనే బైడెన్‌కు 90 మిలియన్(9 కోట్లు) డాలర్లు అందాయి. ఇవి భారత కరెన్సీలో 760 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని అంచనా.
ఇక, ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి బైడెన్ వర్గానికి 19.2 కోట్ల డాలర్లు అందాయి. అయితే.. ఈ విరాళాలు అందించి న వారిలో సామాన్యులు కూడా ఉన్నారని, వారి నుంచి 100 - 200 డాలర్లు కూడా అందాయని బైడెన్ వర్గం వెల్లడించడం విశే షం. ఇక, ఈ నిధులను ప్రచారానికే ఖర్చు చేస్తున్నట్టు తెలిపింది.
ఇక, ట్రంప్ విషయానికి వస్తే.. కేవలం ఒకే కార్యక్రమం ద్వారా 5 కోట్ల డాలర్లు సేకరించినట్టు ట్రంప్ ప్రాతినిధ్యం వహిస్తున్న రిపబ్లికన్ పార్టీ చెప్పింది. దీనికి ముందు కూడా 6.5 కోట్ల డాలర్లు సేకరించినట్టు వెల్లడించింది. దీంతో మార్చి నాటికి తొలి మూడు మాసాల కాలంలో 9.31 కోట్ల డాలర్లు ఉన్నాయని పేర్కొంది. ఇక, ట్రంప్‌కు విరాళిస్తున్నవారిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇతర పారిశ్రామిక వర్గాలు, ఐటీ కంపెనీల అదినేతలు ఉండడం గమనార్హం.